రాజకీయ యాత్రలు: బీజేపీ, టీడీపీ వాటాలు

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపుపై అటు టీడీపీ, ఇటు జనసేన-బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలు, ప్రతిపక్షాలపై వారి నమ్మకం.. ఇవే తమ విజయానికి కారణం అంటూ ఢంకా…

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపుపై అటు టీడీపీ, ఇటు జనసేన-బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలు, ప్రతిపక్షాలపై వారి నమ్మకం.. ఇవే తమ విజయానికి కారణం అంటూ ఢంకా భజాయిస్తున్నాయి. 

ఎవరి గెలుపు వారికి పైకి కనిపించే అజెండా అయితే.. వైసీపీ ఓటమి మాత్రం కామన్ హిడెన్ అజెండా. అందుకే మతం పేరు చెప్పి మరీ ఓట్లు అడుక్కోడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.

ఏపీలో మత రాజకీయాల భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియాలంటే, తిరుపతి ఉప ఎన్నికే వీళ్లకు లిట్మస్ టెస్ట్. ఈ రిజల్ట్ బేస్ చేసుకుని మిగతా రాజకీయ కుట్రలకు తెర తీయాలనుకుంటున్నాయి ఈ 3 పార్టీలు.

రాజకీయ తీర్థ యాత్రలు..

హిందూ ధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెబుతున్న టీడీపీ, బీజేపీ రెండూ… తిరుపతి ఉప ఎన్నికల కోసం యాత్రల్ని మొదలుపెడుతున్నాయి. 

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రేపటి నుంచి ధర్మ పరిరక్షణ యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు చంద్రబాబు. 700గ్రామాలు, 10రోజులు ఈ యాత్ర టార్గెట్. వైసీపీ దుర్మార్గాలను నిలదీయాలని, ప్రజల్ని చైతన్య పరచాలని.. ఈ యాత్ర ద్వారా ఉప ఎన్నికల ప్రచార నగారా మోగిస్తామంటున్నారు బాబు.

బీజేపీ యాత్ర ఇలా..

చంద్రబాబు యాత్ర అయిపోగానే నాలుగు రోజుల విరామం తర్వాత బీజేపీ యాత్ర మొదలవుతుంది. ఫిబ్రవరి 4 నుంచి కపిల తీర్థం టు రామతీర్థం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు బీజేపీ నేతలు. 

ఈ యాత్రలో అన్ని జిల్లాలు కవర్ చేస్తామని అంటున్నా.. వారి ప్రధాన అజెండా మాత్రం తిరుపతి నియోజకవర్గమే. ఈ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, జగన్ ని హిందూ ద్వేషిగా చూపించడమే వారి లక్ష్యం. అందుకే బాబు యాత్రకు అడ్డు లేకుండా తమ యాత్రను ప్లాన్ చేసుకున్నారు.

రెండో ప్లేస్ కోసం పోటా పోటీ..

వాస్తవానికి అటు టీడీపీలో కానీ, ఇటు జనసేన-బీజేపీలో కానీ తిరుపతి ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేదు. రెండు పార్టీలు రెండో స్థానం కోసం విపరీతంగా పోటీపడుతున్నాయి, హిందుత్వాన్ని భుజానికెత్తుకుని గుడ్డిగా పరుగెడుతున్నాయి. 

వైసీపీని ఓడించలేకపోయినా మెజార్టీ తగ్గించి, ప్రజల్లో ఆదరణ తగ్గిందని ప్రచారం చేసి సంబరపడాలనుకుంటున్నాయి. రెండో స్థానం నిలబెట్టుకుంటే.. రాష్ట్రంలో పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనని చెప్పడం చంద్రబాబుకి సులువు. 

టీడీపీని వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకితే.. ఎప్పటికైనా వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడానికి బీజేపీ-జనసేనకు అవకాశం ఉంటుంది. అందుకే తిరుపతి ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాటాలేసుకుని మరీ తీర్థ (రాజకీయ) యాత్రలను ప్లాన్ చేసుకున్నాయి.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ ఒక్కటే కాదు నాకు సీరియస్ రోల్స్ చాలా ఇష్టం