కోస్తా తీర ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా భారీ నిర్మాణాలు చేపట్టరాదని సీఆర్జెడ్ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి. అయితే రాజకీయ పలుకుబడితో అధికార దర్పంతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన వారి జాబితా చాలానే ఉంది.
విశాఖ నుంచి భీమునిపట్నం దాకా చూసుకుంటే ఎందరో ప్రముఖులు ఇలా సీఆర్జెడ్ నిబంధలనకు విరుద్ధంగా నిర్మాణాలు చేసి ఎంజాయ్ చేస్తున్న చరిత్ర ఉంది.
ఇపుడు అలాంటి వాటికి చరమ గీతం పాడేందుకు వైసీపీ సర్కార్ రెడీ అయిపోయింది. కోస్తా రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వచ్చే భవనాలు, ఇతర నిర్మాణాలు ఎంతటి పెద్ద వారివైనా అక్రమమని ప్రభుత్వం అంటోంది. ఒక్క వేటుతో వాటి పని పట్టేందుకు కూడా రెడీ అవుతోంది.
దాంతో ఇపుడు విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న బిల్డింగులకు మూడింది అంటున్నారు. తాజగా ఒక ప్రముఖ హొటల్ మీద జీవీఎంసీ అధికారులు గునపం దించేశారు. దాంతో ఇక తమ సంగతేంటని కూడా మిగిలిన వారిలో టెన్షన్ ఒక్కసారిగా మొదలైంది.
మొత్తం మీద బీచ్ రోడ్డు లో సీఆర్జెడ్ చట్టం పటిష్టంగా అమలు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఇది విశాఖ రాజకీయాల్లో సరి కొత్త సీన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.