బోయపాటికి ఆల్టర్ నేటివ్

మాస్ యాంగిల్ డైరక్షన్ చేయడం అంత వీజీకాదు. కేవలం ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ కూర్చుంటే పెద్ద హీరోలు డేట్ లు ఇవ్వరు. త్రివిక్రమ్ మాదిరిగా మాస్ టచ్ వున్న ఫ్యామిలీ సినిమాలు తీయగలిగితే అది…

మాస్ యాంగిల్ డైరక్షన్ చేయడం అంత వీజీకాదు. కేవలం ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ కూర్చుంటే పెద్ద హీరోలు డేట్ లు ఇవ్వరు. త్రివిక్రమ్ మాదిరిగా మాస్ టచ్ వున్న ఫ్యామిలీ సినిమాలు తీయగలిగితే అది వేరే సంగతి. 

ఊరమాస్ సినిమాల్లో దర్శకుడు బోయపాటిది ఓ స్టయిల్. కానీ ఆయనతో సమస్య ఏమిటంటే బడ్జెట్ అన్నది అదుపులో వుండదు. అరవైలు, డెభైలు దాటేస్తుంది. పైగా బోయపాటి ఊరమాస్ చూసి, అందరు హీరోలు ఆయనతో చేయడానికి ధైర్యం చేయడం లేదు. 

పైగా బోయపాటి సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ కు అంత ప్లేస్ వుండదు.కానీ ఇప్పుడు బోయపాటి మైనస్ లకు ఆప్షన్ గా కనిపిస్తున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమాను వితవుట్ హీరో రెమ్యూనిరేషన్ 32 కోట్లలో చేసారు.

కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, రొమాంటిక్, ఫన్ కూడా యాడ్ చేస్తాడు గోపీచంద్ అనిపించుకున్నారు. అందువల్ల గోపీచంద్ ను బోయపాటికి ఆప్షన్ గా చూస్తున్నారు నిర్మాతలు.

మైత్రీ మూవీస్ లో బాలకృష్ణతో చేయడానికి కమిట్ అయిపోయారు కానీ కాస్త వెయిట్ చేస్తే పెద్ద హీరోలు ఎవరన్నా సెట్ అయ్యే చాన్స్ వుండేదని ఇండస్ట్రీ టాక్. 

ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమా చేయబోతున్నారు గోపీచంద్ మలినేని అని తెలుస్తోంది. మరొక్క హిట్ పడిందంటే మిడ్ లైన్ లోంచి టాప్ లైన్ లోకి వెళ్లిపోతారు గోపీచంద్ మలినేని.

కామెడీ ఒక్కటే కాదు నాకు సీరియస్ రోల్స్ చాలా ఇష్టం

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్