ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయింది. కలెక్షన్ల సునామీ అంటూ హోరు మొదలయింది. ఈ హొరులో గమనించని విషయం ఒకటి టాలీవుడ్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రెండో సగం చూసిన ఎన్టీఆర్ బాగా అప్ సెట్ అయ్యారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎఎమ్ బి మాల్ లో అందరితో కలిసి సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆయనను చూసిన వారంతా అసంతృప్తితో వున్నారని పసిగట్టేసారని బోగట్టా. అదే సమయంలో ఎన్టీఆర్ తన అసహనాన్ని, అసంతృప్తిని అక్కడ వేరే వాళ్లపై వేరే విధంగా కాస్త ప్రదర్శించారని తెలుస్తోంది.
రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ఇంకా మరి కొంత మంది సినిమా చూసాక ఓ డ్రయివ్ ఇన్ లో బ్రేక్ ఫాస్ట్ కు కూర్చోవాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదట. అలాగే థియేటర్ విజిట్ కు కూడా వెళ్లాల్సి వుంది. దాన్ని కూడా ఎన్టీఆర్ స్కిప్ చేసారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సెకండాఫ్ లో చరణ్ కు ఇచ్చిన ఎలివేషన్లు ఎన్టీఆర్ కు ఏమాత్రం లేకపోవడం చూసి ఫీలయినట్లు తెలుస్తోంది. అందుకే తొలి రోజు తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైలంట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ పాత్రకు ఓ మొదలు లేదు…ఫ్లాష్ బ్యాక్ లేదు. సరైన ముగింపు లేదు. అదే చరణ్ పాత్రకు చిన్నతనం నుంచి ఎలివేషన్ ఇచ్చుకుంటూ, రాముడి గెటప్ మాదిరిగా కనిపించే సీతారామరాజుగా మార్చి హైలైట్ చేసారు. నార్త్ బెల్ట్ లో ఇప్పుడు ఈ గెటప్ నే హల్ చల్ చేస్తోంది.
ఏ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎన్టీఆర్ కష్టపడ్డారో అది రాకుండా అయిపోయింది. చరణ్ ను పాత్ర పరంగా అయినా అంత సేపు భుజాల మీద మోస్తూ ఎన్టీఆర్ తిరగడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు