విజయ్-ఫ్యామిలీ స్టార్/కుటుంబరావ్

హీరో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ సినిమా షూట్ స్టార్ట్ అయింది. అయితే పూర్తి కావడానికి, విడుదలకు ఇంకా చాలా టైమ్ వుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీతో తయారవుతోందీ సినిమా.  Advertisement…

హీరో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ సినిమా షూట్ స్టార్ట్ అయింది. అయితే పూర్తి కావడానికి, విడుదలకు ఇంకా చాలా టైమ్ వుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీతో తయారవుతోందీ సినిమా. 

గీతగోవిందం తరువాత మళ్లీ దాదాపు అలాంటి సబ్జెక్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. హీరో క్యారెక్టర్ బలంగా వుంటూనే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాంతో పాటే కుటుంబరావ్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కుటుంబరావ్ అనే టైటలి విజయ్ లాంటి హీరోకి ఆఫ్ బీట్ గా వుంటుంది. ఫ్యామిలీ స్టార్ కూడా కాస్త డిఫరెంట్ గా వుంటుంది కానీ రాను రాను అలవాటు అవుతుంది.

ఈ రెండు టైటిళ్లను పరిశీలనలోకి తీసుకుని, ఇంకా మరో టైటిల్ ఏదైనా దొరుకుతుందా అని అన్వేషిస్తున్నారు. ఎలాగూ ఇంకా చాలా టైమ్ వుంది కనుక, తొందరేం లేదు. అప్పటి వరకు ఈ రెండూ వర్కింగ్ టైటిళ్లుగా వినిపిస్తూనే వుంటాయి.