వణుకుతున్న విశాఖను చూస్తున్న బాబు

చంద్రబాబుకు విశాఖ మీద ప్రేమ అభిమానం ఎక్కువ అయిపోయాయా. బాబు విశాఖ భద్రత గురించి చాలా బాధపడుతున్నారు. విశాఖ ఏమై పోతుందో అని తల్లడిల్లిపోతున్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీని కొందరు కిడ్నాప్…

చంద్రబాబుకు విశాఖ మీద ప్రేమ అభిమానం ఎక్కువ అయిపోయాయా. బాబు విశాఖ భద్రత గురించి చాలా బాధపడుతున్నారు. విశాఖ ఏమై పోతుందో అని తల్లడిల్లిపోతున్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీని కొందరు కిడ్నాప్ చేసిన ఘటనలో విశాఖ గతేం కానని బాబు కుప్పం నుంచే కలవరపడిపోతున్నారు.

విశాఖ సేఫెస్ట్ సిటీగా ఒకనాడు ఉండేదని ఇపుడు మాత్రం జనాలు భయపడిపోతున్నారని వణికిపోతున్నారు అని బాబు అంటున్నారు. హుదూద్ తుఫాన్ని విశాఖ వాసులు తట్టుకున్నారు కానీ వైసీపీ అక్రమాలకు మాత్రం బెంబేలెత్తుతున్నారని అంటున్నారు.

హుదూద్ తుపాన్ టైం లోనే కదా మొత్తం భూముల రికార్డులు అన్నీ గాయబ్ చేసింది అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తం రికార్డులు గల్లంతు అయిపోయాయని చెప్పి ప్రభుత్వం ప్రైవేటు అన్న తేడా లేకుండా కబ్జాలు చేసింది నాడే కదా అని ప్రశ్నిస్తున్నారు.

భూ కబ్జాలకు టీడీపీ ఏలుబడిలోనే బీజం పడిపోయిందని తెలియదా బాబూ అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నారు. ఏ సంఘటన జరిగినా దాన్ని స్టేట్ కి సిటీకి అంటకట్టి రచ్చ చేయడం బాబుకు అలవాటే అంటున్నారు. విశాఖని పాలనా రాజధాని చేద్దామని అనుకుంటే సునామీ భయాలు పెట్టిన వారున్నారు.

విశాఖలో ఇపుడు సేఫ్ కాదని మరోసారి బాబు గొంతు ఎత్తుతున్నారు. విశాఖలో పాతిక నుంచి ముప్పయి లక్షల మంది నివసిస్తున్నారు. ఒక మినీ ఇండియా విశాఖ. అన్ని రాష్ట్రాలకు చెందిన వారు విశాఖలో ఉంటారు. పెద్ద నగరం, ఏపీలో మెగా సిటీగా ఉన్న విశాఖకు డైలీ ఎక్కడ నుంచి ఎక్కడి వారు అయినా వస్తారు.

అంతటి సిటీలో జరిగే ఒకటీ అరా సంఘటలు మొత్తం విశాఖకే ఎలా అంటగడతారు బాబూ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోలేక అవస్థ పడ్డారని బాబు ఆరోపిస్తూంటే దాన్ని మంత్రి గుడివాడ అమరనాధ్ కొట్టి పారేశారు. విషయం తెలిసిన కొన్ని గంటలలోనే కిడ్నాప్ కేసుని చేదించిన ఘనత పోలీసులది అయితే లా అండ్ ఆర్డర్ లేదు అని బాబు అనడమేంటని మండిపడ్డారు.

రాజకీయానికి ఏదీ అతీతం కాదని బాబు ఇపుడు విశాఖను కూడా వాడేసుకుంటున్నారు అని అంటున్నారు బాబు ఏలుబడిలో భూ కబ్జాలు జరిగితే నాడు విశాఖ వణకలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని మరి దేనికో ముడెట్టేసి మసాలా రాజకీయం చేయడం బాబుకు అలవాటే అంటున్నారు వైసీపీ నేతలు.

విశాఖతో సహా ఏపీలోనే గత నాలుగేళ్లలో నేరాల సంఖ్య తగ్గిందని పోలీసులు అంటున్నారు. కానీ విశాఖ ఏమైపోతోందో అని బాబు గుండెలు బాదుకోవడం చూస్తే విశాఖ ఏమైపోవాలి, టీడీపీకి ఏమి కావాలి అని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.