విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబుకు నటుడిగా ఓ ప్రత్యేకత. విలన్‌గా, హీరోగా, అవసరమైతే కామెడీని పండించడంలో ఆయనకు ఆయనే సాటి. మేజర్‌చంద్రకాంత్, ఇటీవల విడుదలైన సన్నాఫ్ ఇండియా సినిమాలను చూస్తే మోహన్‌బాబు దేశభక్తిని గుర్తించొచ్చు. మోహన్‌బాబు రీల్ లైఫ్, రియల్ లైఫ్నకు పెద్దగా తేడా ఉండదనే అభిప్రాయాలు లేకపోలేదు.
రాజమహేంద్రవరంలో ఓ సభలో మోహన్‌బాబు మాట్లాడుతూ పెద్ద జోక్ పేల్చారు. దీంతో మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో కొందరు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 1998లో తాను ప్రచారం చేయడం వల్లే బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
ఇదే వేదికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉండగానే బీజేపీకి 18 శాతం ఓట్లు తెచ్చానని మోహన్‌బాబు జోక్ పేచ్చడం విశేషం. ఇదే సభలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. బహుశా కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు మనసులో పడిపడి నవ్వుకుని వుంటారని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
అంతేకాదు, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జనంతో జేజేలు కొట్టించడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించడం తెలిసిందే.