కాజల్ అగర్వాల్… 2007లో తేజ తెరకెక్కించిన లక్ష్మీకల్యాణం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన అందగత్తె. అయితే ఆమెకు బిగ్ హిట్ అందించిన సినిమా మాత్రం 2009లో వచ్చిన మగధీర అని చెప్పాలి.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమానే మగధీర. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి బ్రేకప్ లభించిందని చెప్పొచ్చు.
కాజల్ అగర్వాల్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. దీనికి కారణం తనకిష్టమైన స్నిహుతుడు గౌతమ్ కిచ్లూను కాజల్ వివాహం చేసుకోవడమే. వివాహ ప్రకటన మొదలుకుని, పెళ్లి, హనీమూన్ వరకూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.
హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి , అక్కడ తెగ ఎంజాయ్ చేసిన సంగతి తెలి సిందే. కాగా పెళ్లి తర్వాత మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగాయని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన జీవితంలో భర్తే సర్వస్వం అయ్యారని చెప్పడం విశేషం. మాల్దీవుల్లో హనీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్టు కాజల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
సినిమాలకు ఎప్పటికీ దూరం కానని తేల్చి చెప్పారు. ఎందుకంటే తన ఫస్ట్ లవ్ సినిమానే అని చెప్పడం విశేషం. కెమెరా ముందు నిలిస్తే ధ్యానంలో ఉన్నాననే ఫీలింగ్‌కు గురి అవుతానన్నారు. రోజువారి దినచర్యను గౌతమ్ ప్రేమగా అందించే కౌగిలింతతో స్టార్ట్ చేస్తానని కాజల్ చెప్పడం విశేషం.
గౌతమ్‌తో కౌగిలింత తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు శ్రీకారం చుడతా నన్నారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తన వ్యక్తిత్వంలోనే లేవని కాజల్ చెప్పారు.