బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న నటాషా దలాల్ ను ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల పెళ్లి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈనెల 22 నుంచి 24 వరకు వీళ్ల పెళ్లి వేడుక జరుగుతుంది.
పెళ్లికి సంబంధించిన వేడుకలు ముంబయి సిటీలో మొదలై అలీబాగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తో ముగియనుంది. ముందుగా ముంబయిలో నటాషా దలాల్ ఇంటికి చీర, కుంకుమ, పసుపు, స్వీట్స్, పండ్లు, ఆభరణాలు పట్టుకొని వరుణ్ ధావన్ కుటుంబసభ్యులు వెళ్తారు. దీన్ని చున్నీ చడానా ఫంక్షన్ అంటారు. ఆ తర్వాత అంతా కలిసి అసలైన పెళ్లి వేడుకల కోసం అలీబాగ్ లోని బీచ్ రిసార్ట్ కు వెళ్తారు.
తన ప్రేమ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో అధికారికంగా వెల్లడించాడు వరుణ్ ధావన్. అప్పట్నుంచి వరుణ్-నటాషా ప్రేమకబుర్లు, పెళ్లి విశేషాలు టాప్ ట్రెండింగ్ లో నిలుస్తూ వస్తున్నాయి.
నిజానికి గతేడాది మే నెలలోనే నటాషాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వరుణ్. కానీ అప్పటికే కరోనా వైరస్ పీక్ స్టేజ్ లో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తన పెళ్లిని వాయిదా వేసుకున్న ఈ హీరో, మరికొన్ని రోజుల్లో నటాషాతో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నాడు.
మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన వరుణ్, స్డూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా మారాడు. సారా అలీఖాన్ తో కలిసి అతడు నటించిన కూలీ నంబర్-1 సినిమా తాజాగా ఓటీటీలో రిలీజైంది.