కాపీ ట్యూన్స్: ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు

ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినప్పటికీ తమన్ పై ఓ విమర్శ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అదే కాపీ-పేస్ట్ ట్యూన్స్ వ్యవహారం. ఆల్రెడీ హిట్ అయిన సాంగ్ ను కాస్త అటుఇటు మార్చి కంపోజ్ చేయడం,…

ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినప్పటికీ తమన్ పై ఓ విమర్శ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అదే కాపీ-పేస్ట్ ట్యూన్స్ వ్యవహారం. ఆల్రెడీ హిట్ అయిన సాంగ్ ను కాస్త అటుఇటు మార్చి కంపోజ్ చేయడం, విదేశాల్లో హిట్టయిన ట్యూన్స్ ను తెలుగులో దించేయడం లాంటివి తమన్ చేస్తుంటాడనేది అతడిపై వినిపించే ప్రధానమైన విమర్శ.

ఈ విమర్శలపై ఇన్నాళ్లూ కాస్త సాఫ్ట్ గా స్పందిస్తూ వచ్చాడు తమన్. స్ఫూర్తి పొందడంలో తప్పు లేదంటూ తననుతాను సమర్థించుకున్నాడు. అంతేకాదు, ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

అయితే ఈసారి తమన్ వరస మారింది. పనిలేని వారు, సంగీత పరిజ్ఞానం లేని వాళ్లు మాత్రమే సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని కాస్త ఘాటుగా స్పందించాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.

“సినిమా సంగీతం విషయంలో ఎంతోమంది ప్రమేయం ఉంటుంది. గీత రచయిత నుంచి పెద్ద బృందం వరకు ఎంతోమందితో కలిసి పనిచేస్తుంటాం. ఒకవేళ కాపీ ట్యూన్ అయితే అంత పెద్ద బృందంలో ఎవ్వరూ తెలుసుకోలేరా? ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ తో పనిచేశాను. నేను చేసేది కాపీ ట్యూన్ అయితే వాళ్లు తెలుసుకోలేరా? పనిలేని వాళ్లు, సంగీత పరిజ్ఞానం లేని వాళ్లు మాత్రమే నాపై కాపీ ట్యూన్స్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంటారు.”

ఇలా తనపై వస్తున్న విమర్శలపై ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు తమన్. నిజంగా కాపీ కొడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని, వందకు పైగా సినిమాలకు పనిచేసిన తనపై ఇప్పటివరకు ఏ కంపెనీ కేసు వేయలేదని స్పష్టంచేశాడు. కాబట్టి తనపై వస్తున్న విమర్శల్లో అర్థంలేదని కొట్టిపారేశాడు.

రీసెంట్ గా క్రాక్ సినిమాకు వర్క్ చేశాడు తమన్. ఈ సినిమాలో కూడా ఓ ట్యూన్ కాపీ అంటూ అతడిపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. 

ఎన్టీ రామారావు,జ‌గ‌న్ ల‌కు కొన్నిపోలిక‌లు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!