ట్రయిలర్ బాగుంది.. ఒక్క ముక్క అర్థం కాలేదు

టీజర్ తో సినిమా జానర్ ఏంటనేది చెబుతారు. ట్రయిలర్ లో కాస్త స్టోరీలైన్ టచ్ చేస్తారు. అలా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తారు మేకర్స్. అయితే ఒక్కోసారి దీనికి రివర్స్ లో కూడా…

టీజర్ తో సినిమా జానర్ ఏంటనేది చెబుతారు. ట్రయిలర్ లో కాస్త స్టోరీలైన్ టచ్ చేస్తారు. అలా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తారు మేకర్స్. అయితే ఒక్కోసారి దీనికి రివర్స్ లో కూడా ఉంటుంది వ్యవహారం. ఈరోజు రిలీజైన కీడా కోలా ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

తరుణ్ భాస్కర్ సినిమాలే వినూత్నంగా ఉంటాయి. ఇప్పుడీ దర్శకుడు మరింత వినూత్నంగా ఆలోచించాడు. కీడాకోలా అనే క్రైమ్ కామెడీ డ్రామాను ప్రేక్షకులకు అందిస్తున్నాడు.

ట్రయిలర్ లో కీలక పాత్రలన్నింటినీ చూపించాడు దర్శకుడు. కానీ కథ ఏంటనే విషయాన్ని ఒక్క ముక్క కూడా రివీల్ చేయలేదు. మధ్యమధ్యలో ఓ కూల్ డ్రింక్, అందులో బొద్దింకను మాత్రం చూపించి, మరింత సస్పెన్స్ పెంచాడు. కథను చెప్పడంలో తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ చూపించాడనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది.

ట్రయిలర్ మొత్తం డిఫరెంట్ కలర్ టిల్ట్ లో ఉంది. దర్శకుడి టేకింగ్ కు తగ్గట్టు, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే కిర్రాక్ గా ఉంది. వచ్చేనెల 3న థియేటర్లలోకి రానుంది కీడాకోలా సినిమా. రానా ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాను, సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

కెరీర్ లో లాంగ్ గ్యాప్ చూశాడు తరుణ్ భాస్కర్. 2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత మళ్లీ అతడి డైరక్షన్ లో సినిమా రాలేదు. మధ్యలో వెంకటేష్ తో సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ గ్యాప్ లో నటుడిగా కూడా మారాడు. కీడాకోలాలో కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు.