విజయ్ దేవరకొండ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు అదే టైటిల్ ప్రకటించారు కాబట్టి పెద్దగా సర్ ప్రైజ్ అనిపించలేదు. కాకపోతే ఆ టైటిల్ కు మేకర్స్ ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం బాగుంది.
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ రిలీజైంది. వీడియోలో విజయ్ దేవరకొండను ఫ్యామిలీ స్టార్ గా చూపించారు. ఇంట్లో ఉల్లిపాయలు తరగడం, పిల్లల్ని స్కూల్ లో దించడం లాంటి పనులు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి బయట మాత్రం పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. హీరో ఎందుకిలా 2 షేడ్స్ లో కనిపిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇదే గ్లింప్స్ లో హీరోహీరోయిన్ మధ్య రిలేషన్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇందులో హీరోహీరోయిన్లు లవర్స్ కాదు, భార్యాభర్తలు. ఖుషి తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ స్వీట్ హజ్బెండ్ పాత్రలో కనిపించబోతున్నాడటన్నమాట.
గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్, వీడియోకు గోపీసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.