అసెంబ్లీలో టీడీపీ అట్టర్ ఫ్లాప్

అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. చివరిగా ఈ సమావేశాల్లో తేలిందేంటి.. టీడీపీ అట్టర్ ఫ్లాప్ అని నిరూపించుకుంది. చంద్రబాబు లేకపోవడంతో చినబాబు సారధ్యంలో హడావిడి చేసినా ఫలితం లేదు.  Advertisement చిడతలు, విజిల్స్ తో రెచ్చిపోయారు…

అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. చివరిగా ఈ సమావేశాల్లో తేలిందేంటి.. టీడీపీ అట్టర్ ఫ్లాప్ అని నిరూపించుకుంది. చంద్రబాబు లేకపోవడంతో చినబాబు సారధ్యంలో హడావిడి చేసినా ఫలితం లేదు. 

చిడతలు, విజిల్స్ తో రెచ్చిపోయారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కనీసం టీడీపీ సభ్యులు సభలో మాట్లాడిన ప్రసంగాలు కూడా లేవు, అన్నీ బయట పేలిన అవాకులు చెవాకులే. మొత్తమ్మీద టీడీపీ షో అట్టర్ ఫ్లాప్ అయింది.

సభలో వైసీపీ డామినేషన్..

సభలో అంతా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల డామినేషనే కనిపించింది. అసలు సభలో మాట్లాడ్డానికి టీడీపీ ఎమ్మెల్యేలు కనీసం ఉత్సాహం చూపించలేదు. ఎక్కడ ఏం మాట్లాడితే, ఎలాంటి కౌంటర్ పడుతుందోనని భయపడ్డారు. 

మాటల పస లేదు కాబట్టే.. చేతల్లోకి దిగారు. అందులోనూ చిడతలు, విజిల్స్ తీసుకొచ్చి చిల్లర వేషాలు వేశారు. దీంతో టీడీపీ సభ్యులపై ప్రసంగాలు చూసేవారికి కూడా ఏహ్యభావం కలిగింది.

సత్తా లేనప్పుడు సభకు ఎందుకు..?

సభలో చేసేదేం లేదు కాబట్టే.. చంద్రబాబు తెలివిగా తప్పించుకున్నారు. చిల్లర బ్యాచ్ ని ముందు పెట్టి ప్లకార్డులు పట్టించారు, సభలో రభస చేయించారు. అసలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం పాత్ర శూన్యం అనిపించారు. 

కనీసం బడ్జెట్ పై కూడా సమగ్ర చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించకపోవడం విచిత్రం. ప్రభుత్వ పథకాలపై మాట్లాడే సత్తా లేకపోవడంతో కేవలం జె-బ్రాండ్ అంటూ కాలం గడిపారు టీడీపీ ఎమ్మెల్యేలు.

చినబాబు కోసమేనా..?

గతంలో అసెంబ్లీలో కనీసం అచ్చెన్నాయుడు, రామానాయుడు తమ ఉనికి చాటుకునేవారు. కానీ వారు కూడా ఈసారి అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీలో వారు మాట్లాడి హైలెట్ అయితే, చినబాబు చిన్నబోతారనే ఉద్దేశంతో చంద్రబాబు అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది. 

అలా అని శాసన మండలిలో నారా లోకేష్ ప్రతిభ ఏదీ బయటపడలేదు. దీంతో అటు మండలిలో, ఇటు అసెంబ్లీలో టీడీపీ షో అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. రాగా పోగా.. బడ్జెట్ సమావేశాలు, హైకోర్టు తీర్పుపై చర్చ జరిగేందుకు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేందుకు అధికార పక్షానికి బాగా ఉపయోగపడ్డాయి.