దీప్తీ భట్నాగర్ విషయంలో వయసుతో రెండింటికి సంబంధం లేదు! ఆమె గ్లామర్ కూ, ఆమె అందాలను ఆరబోయడానికి! యాభై నాలుగేళ్ల వయసు వచ్చిందంటే.. శారీరకమైన గ్లామర్ సహజంగానే తగ్గిపోతుంది.
హీరోయిన్లుగా వెలుగొందిన కొందరు డ్రీమ్ గర్ల్స్ కూడా.. విపరీతమైన మేకప్పులతో కవర్ చేయడానికి విఫలయత్నం చేస్తూ ఉంటారు. అయితే నీటి కొలనులో దిగిన ఫొటోల్లో కూడా అందంగా కనిపించడం దీప్తీకే సాధ్యం అవుతూ ఉంది.
వయసు పెరుగుతున్న కొద్దీ అందం విషయంలో దీప్తీ భట్నాగర్ సరికొత్త సొబగులు అద్దుకుంటున్నట్టుగా ఉంది. గత కొన్నేళ్లుగా టూరిజం ప్రమోటర్ గా వ్యవహరిస్తూ ఉన్న దీప్తీ భట్నాగర్ ప్రస్తుతం ఫిన్ లాండ్ లో విహరిస్తూ ఉంది.
అక్కడి అందమైన లొకేషన్ల నుంచి మరింత అందంగా దిగిన ఫొటోలను ఆమె పోస్టు చేస్తూ ఉంది. ఈ క్రమంలో స్విమ్ సూట్లో ఇలా పోజులిచ్చింది ఈ నటీమణి. పనిలో పనిగా ఫిన్ లాండ్ అద్భుతంగా ఉంటుందని, తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశమని కూడా దీప్తీ భట్నాగర్ చెబుతోంది.