నేను నాలుగు సార్లు టెన్త్ తప్పి ఎమ్మెల్యేనయ్యా

చంద్రబాబు, లోకేష్ కి మళ్లీ చాకిరేవు మొదలైంది. కొడాలి మార్కు ఉతుకుడు ఈసారి స్ట్రాంగ్ డోస్ లో పడింది. జగన్ టెన్త్ క్లాస్ పాస్ కాలేదంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నాని తీవ్ర…

చంద్రబాబు, లోకేష్ కి మళ్లీ చాకిరేవు మొదలైంది. కొడాలి మార్కు ఉతుకుడు ఈసారి స్ట్రాంగ్ డోస్ లో పడింది. జగన్ టెన్త్ క్లాస్ పాస్ కాలేదంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వెధవ గురించి మాట్లాడ్డం నా ఖర్మ అంటూనే పప్పు, తుప్పు అంటూ విరుచుకుపడ్డారు. 

టన్నులకి టన్నులు పప్పు తినడానికి మాత్రమే లోకేష్ పనికొస్తారని మండిపడ్డారు. అమెరికాలో చదివానని చెప్పుకునే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారని, నాలుగుసార్లు టెన్త్ తప్పి తాను ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు మంత్రి నాని. వృద్ధుడిని చంపి, పార్టీ లాక్కొన్నారని, చివరకు ఆ పార్టీని నాశనం చేశారని ఎన్టీఆర్ వెన్నుపోటు ప్రస్తావన తెచ్చారు.

దరిద్రుడు దొరికాడు..

లోకేష్ గురించి నన్ను అడగొద్దు, నేను చెప్పను అంటూనే.. పప్పు తుప్పు అంటూ లోకేష్ ని చెడామడా ఆడేసుకున్నారు మంత్రి నాని. లోకేష్ గురించి మాట్లాడ్డం కంఠశోష తప్ప ఇంకేమీ కాదన్నారు. అసలు ప్రెస్ మీట్లు పెట్టడానికి లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని అడిగారు. లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కదా అని జర్నలిస్ట్ లు అడగడంతో.. అసలు టీడీపీ జాతీయ పార్టీనా అని ప్రశ్నించారు.

టీడీపీ జాతీయ పార్టీనా కాదా అని ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తానని చెప్పిన నాని, టీడీపీ జాతీయ పార్టీ అని సమాధానం వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. తన తాతది గుడివాడ అని చెప్పుకునే లోకేష్.. దమ్ముంటే గుడివాడకు వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పేరు చెబితే ప్యాంట్ లు తడిసిపోయాయి..

గతంలో కాంగ్రెస్ పేరు చెబితే చంద్రబాబుకి ప్యాంట్ లు తడిసిపోయాయని, అప్పట్లో సోనియాను వ్యతిరేకించి, తప్పుడు కేసులు పెట్టినా ధైర్యంగా జైలుకెళ్లొచ్చిన జననేత జగన్ అని అన్నారు మంత్రి నాని. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్, 151మంది ఎమ్మెల్యేలతో సీఎంగా ఎన్నికైన జగన్ ని విమర్శించే హక్కు లేదన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో 15 రోజులుగా చంద్రబాబుపై జగన్ ఒక్క మాట కూడా తూలలేదన్నారు నాని. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ దూరితే నష్టం ఏర్పడుతుందని అన్నారు. సభకు చట్టం చేసే హక్కు ఉందని, తామెక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదని స్పష్టం చేశారు. టీడీపీ కోరిక ప్రకారం విశాఖపట్నం వెళ్లి పరిపాలన చేసి, మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. ఈసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు నాని.