ఏపీ బీజేపీతో బ్యూటీకి బంధం తెగిందా!

ఏపీ బీజేపీతో పొలిటిక‌ల్ బ్యూటీ సాదినేని యామిని శర్మకు బంధం తెగిందా? అంటే …ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు ఇవాళ టీడీపీ అనుబంధ ప‌త్రిక ఎడిట్ పేజీలో ఆమె రాసిన వ్యాసాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. ఇంత…

ఏపీ బీజేపీతో పొలిటిక‌ల్ బ్యూటీ సాదినేని యామిని శర్మకు బంధం తెగిందా? అంటే …ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు ఇవాళ టీడీపీ అనుబంధ ప‌త్రిక ఎడిట్ పేజీలో ఆమె రాసిన వ్యాసాన్ని ఉద‌హ‌రిస్తున్నారు. ఇంత కాలం బీజేపీ నాయ‌కురాలిగా చెలామ‌ణి అవుతున్న యామిని శ‌ర్మ‌, ఒక్క‌సారిగా సామాజిక కార్యకర్తగా అవ‌త‌రించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీతో రాజ‌కీయ సంబంధాలను ఆమె తెంచుకున్నార‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ యామిని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగారు. బీజేపీ, జ‌న‌సేన‌, వైసీపీని ఇష్టానుసారం తిట్టేవారు. ప్ర‌తిరోజూ టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాల‌య్యారు. దీనికి తోడు ఆమె అందం ప్ర‌త్యేక గుర్తింపు రావ‌డానికి కార‌ణ‌మైంది. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేద‌ని మోదీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీలో చంద్ర‌బాబు నేతృత్వంలో చేప‌ట్టిన దీక్ష‌లో యామిని తెలుగు త‌ల్లి వేష‌ధార‌ణ‌లో ఆక‌ట్టుకున్నారు. మోదీని సైతం ఆమె ఢిల్లీ వేదిక‌గా తిట్ట‌కుండా వ‌దిలి పెట్ట‌లేదు. ఎప్పుడైతే టీడీపీ అధికారాన్ని కోల్పోయిందో, ఆమె కూడా ఆ పార్టీని వీడారు. జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో చేరిపోయారామె.

వారణాసిలోని కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా ఆమె నియమితులయ్యారు. కాశీ విశ్వనాథ ఆల‌య కార్యక్రమాలను, సేవలను రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు, తమిళనాడు, కర్నాటక ప్ర‌జ‌ల‌కు తెలియజేసే బాధ్య‌త‌ను యామిని శర్మ చేప‌ట్టారు. బీజేపీలో చేరిన కొత్త‌లో యామిని వైసీపీ ప్ర‌భుత్వంపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఒక సంద‌ర్భంలో ఆమెపై కేసు కూడా న‌మోదైంది. అప్పుడు ఆమెకు బీజేపీ నేత‌లంగా సంఘీభావంగా నిలిచారు.

ఆ త‌ర్వాత ఎక్క‌డా పార్టీ కార్య‌క్ర‌మాల్లో యామిని క‌నిపించ‌డం లేదు. క‌నీసం ట్వీటో, ప్ర‌క‌ట‌న చేసేందుకు కూడా ఆమె ముందుకు రాలేదు. యామిని రాజ‌కీయ పంథా… మెరుపు తీగ‌ను త‌ల‌పిస్తుంద‌ని బీజేపీ నేత‌లు చెబుతుంటారు. పార్టీ వైఖ‌రిపై ఆమె ఎందుకు అల‌క‌బూనారో తెలియ‌డం లేదు. ఇవాళ ఉన్న‌ట్టుండి “తెగిన మాంగ‌ల్యాల ఉసురు!” అంటూ బీజేపీ నాయ‌కురాలిగా కాకుండా, సామాజిక కార్య‌క‌ర్త‌గా వ్యాసం రాయ‌డం గ‌మ‌నార్హం. 

బీజేపీతో ఆమె బంధం తెగిపోయింద‌నే చ‌ర్చ‌కు యామినీనే అవ‌కాశం ఇచ్చారు. అయినా జాతీయ‌స్థాయిలో మ‌రోసారి బీజేపీ అధికారానికి భ‌యం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న ప‌రిస్థితిలో యామిని ఆ పార్టీ ప్ర‌తినిధిగా చెప్పుకునేందుకు సిగ్గుప‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. లేదంటే సామాజిక కార్య‌క‌ర్త‌గా రాసుకోవ‌డంలో యామిని ఉద్దేశం ఏంట‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. బీజేపీలో కొన‌సాగ‌డంపై ఆమె లేదా పార్టీ క్లారిటీ ఇవ్వాల్సి వుంది.