వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బిత్తరపోతోంది. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం ఎంత కష్టమో నిన్నటి అసెంబ్లీలో ఆయన ప్రసంగం విన్న తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి తెలిసొచ్చింది. మూడు రాజధానులు, హైకోర్టు సంచలన తీర్పుపై జగన్ ప్రసంగం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సాగింది. అధికారమైనా, విజయమైనా సాహసినే వరిస్తుంది. అదే వైఎస్ జగన్ విజయ రహస్యం.
వైఎస్ జగన్ ఓ సాహసి. దానికి నిలువెత్తు నిదర్శనం… అసెంబ్లీలో హైకోర్టు తీర్పుపై చర్చ పెట్టడమే కాదు, అది తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని వ్యాఖ్యానించడం కూడా. ఇలా మాట్లాడ్డానికి ఎంతో గుండె ధైర్యం వుండాలి. అది జగన్‌లో పుష్కలంగా ఉంది. మూడు రాజధానుల ఆవశ్యకతపై అసెంబ్లీలో జగన్ ప్రసంగించారనే కంటే ….అసెంబ్లీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసి పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శాసన వ్యవస్థ ఉనికి, అధికారాలను హరించేలా హైకోర్టు తీర్పు వుందని, లెజిస్లేచర్ స్వయంప్రతిపత్తిని కాపాడుకునేందుకే చర్చ పెట్టామనే జగన్ వ్యాఖ్యలను భావితరాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాయి. వర్తమాన సమాజం ఆయన ముందు చూపును కొనియాడుతూ వుంటుంది.కొన్ని రాజ్యాంగ వ్యవస్థల ద్వారా జగన్‌ను కట్టడి చేయాలనే ప్రధాన ప్రతిపక్షం కుట్రలను ఛేదించి, తెలుగు సమాజం అబ్బురపడేలా శాసన వ్యవస్థ గొప్పతనాన్ని కాపాడుకునేందుకు పోరాడిన, పోరాడుతున్న నాయకుడిగా జగన్‌ను చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే టీడీపీని రాజకీయంగా భారీగా దెబ్బతీస్తోంది. జగన్ పాలనలో అనేక లోపాలు ఉన్నాయి. అంతెందుకు, తాము తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయని, అందుకే వెనక్కి తీసుకుని, కొత్తవి తీసుకొస్తామని జగనే స్వయంగా ప్రకటిం చారు. జగన్‌ను రాజకీయంగా వ్యతిరేకించడం వేరు, ఆయన పేరుతో ఏపీ సమాజాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నడం వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాలు, విద్వేషాలు, విషపూరిత చర్యలన్నీ అంతిమంగా తమ వినాశనానికి కారణమవుతున్నాయిని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆవేదనతో కూడా ఆగ్రహంగా ఉంది. అందుకే జగన్ పాలనపై ఎన్ని విమర్శలొస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ క్షేత్రస్థాయిలో పుంజుకోలేకపోతోంది.
ఇటీవల ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశమై దిశానిర్దేశం చేసిన మొదలు, ఆ పార్టీపై జనం మూడ్ మారుతోంది. నెమ్మదిగా వైసీపీపై సానుకూలత పెరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతుండడం గమనార్హం. నిన్నటి జగన్ స్పీచ్‌తో వైసీపీ శ్రేణులతో పాటు జనంలో మరింత పాజిటివిటీ పెరిగింది. మరోసారి వైసీపీదే అధికారమే భరోసా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అమాంతం పెరిగింది.
ఇంతకాలం టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారంతో మరోసారి అధికారంపై వైసీపీలో ఏ మూలో మరోసారి అధికారంపై అనుమానం వుండేది. కానీ తాజా పరిస్థితి వేరు. జగన్ జనంలోకి రానంత వరకే టీడీపీ, ఎల్లో మీడియా ఆటలని తేలిపోయింది. రానున్న రోజుల్లో జనంలోనే ఉండాలని జగన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో కథ వేరేలా ఉంటుందనే ధీమా వైసీపీ శ్రేణుల్లో , ప్రజాప్రతి నిధుల్లో వ్యక్తమవుతోంది.
వైఎస్ జగన్ నుంచి అధికారం లాక్కోవడం అంత సులభం కాదని నిన్నటి జగన్ ప్రసంగం విన్నవారె వరికైనా అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేశ్‌కు బాగా అర్థమై వుంటుంది. ఎందుకంటే జగన్‌కు ప్రధాన ప్రత్యర్థులు వారే కాబట్టి.