జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్ హాస్య చతురత కలిగిన నేత. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తాజాగా ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
ఆయన లోని రసిక హాస్య చతురతను ఆ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఫరూఖ్ అబ్దుల్లా తనలోని రసిక హృదయాన్ని బయట పెట్టుకోవడం గురించి తెలుసుకుందాం.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన ఫరూఖ్ అబ్దుల్లా జమ్మూలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి కారణంగా తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోతున్నట్టు మహమ్మారిపై చమత్కారం విసిరారు. ఈ సభలో ఇంకా ఆయన ఏమన్నారంటే…
‘కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా జనం భయపడే పరిస్థితి. కౌగిలించుకోవాలని హృదయం కోరుతున్నా అలా చేయలేకపో తున్నాం. ఇతరులతో కరచాలనం చేస్తే, కౌగిలించుకుంటే ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు. నేను నా భార్యకు కనీసం ముద్దు కూడా పెట్టలేకపోతున్నా. అలాగే నేను మాస్కు ధరించకుండా ఉన్న ఫొటో నా కూతురి కంటపడితే ఇంటికెళ్లాక ఇక నా పని అయిపోయినట్లే’’ అని ఫరూఖ్ అన్నారు.
ఫరూఖ్ అబ్దుల్లా ప్రసంగం విన్న సభికులు హాయిగా నవ్వుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా బ్రిటన్కు చెందిన మోలీని వివాహం చేసుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఫరూఖ్ అబ్దుల్లా కొంత కాలం బ్రిటన్లో తన సేవలు అందించారు. అబ్దుల్లా కుమార్తెను ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సచిన్ ఫైలెట్ పెళ్లాడారు.