ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు!

తెలంగాణ రాష్ట్రంలో మ‌రోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.  భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఇవాళ ఉద‌యం నుండి ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈరోజు ఉదయం నుండి…

తెలంగాణ రాష్ట్రంలో మ‌రోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.  భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఇవాళ ఉద‌యం నుండి ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈరోజు ఉదయం నుండి సుమారు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయ‌న‌ సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలకై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఆయ‌న‌ అనేక కంపెనీలలో బినామీగా ఉన్నార‌ని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ల వనిత డైరెక్టర్ గా కొనసాగుతున్న, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ , మేయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, కంపెనీలల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ‌త కొంత కాలంగా సైలెంట్ గా ఐటీ.. తాజా దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. భువనగిరి నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.