ఎఎఎ తో ఎవరికి ఎఫెక్ట్

ఆసియన్ సినిమాస్ సంస్థ హీరో మహేష్ బాబుతో జతకట్టి ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభించింది. హైదరాబాద్ సిటీకి ఓ ఐకానిక్ థియేటర్లుగా మారాయి. సెలబ్రిటీలు ఎవరు సినిమా చూడాలన్నా ఇదే ఫస్ట్ చాయిస్.…

ఆసియన్ సినిమాస్ సంస్థ హీరో మహేష్ బాబుతో జతకట్టి ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభించింది. హైదరాబాద్ సిటీకి ఓ ఐకానిక్ థియేటర్లుగా మారాయి. సెలబ్రిటీలు ఎవరు సినిమా చూడాలన్నా ఇదే ఫస్ట్ చాయిస్. ఎఎంబి కారణం అప్పటి వరకు లీడ్ లో వున్న ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ కొంత మసకబారింది. 

ముఖ్యంగా అక్కడికి మాస్ ఎక్కువగా వస్తారు కనుక, సినిమా సెలబ్రిటీలు రావడం తగ్గించారు. కానీ ఫ్రైడే సినిమా లవర్స్ వెళ్లేది ఎక్కువగా ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ కే. సినిమా స్పెషల్ షో లు అన్నీ అక్కడే. కానీ రాను రాను ప్రసాద్స్ ప్రాభవం అయితే తగ్గుతోంది. ఎంత రిన్నోవేట్ చేసినా, సీటింగ్ అరేంజ్ మెంట్, పార్కింగ్, ఫడ్ ఇలా చాలా విషయాల్లో ఎఎంబి తో పోల్చుకుంటే సెకెండ్ ప్లేస్ నే.

కానీ ఇప్పుడు అదే ఆసియన్ సంస్థ అల్లు అర్జున్ తో జతకట్టి ఎఎఎ సత్యం సినిమాస్ ను ప్రారంభిస్తోంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ మీద ఎక్కువగా పడేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రసాద్ ను కాపాడుతున్నది ఉదయం 8.45 షో అన్నదే. అంత ముందుగా మరెవరు షో వేయడం లేదు. కారణం అన్ని మల్టీ ఫ్లెక్స్ లు మాల్స్ లో వుంటాయి. అవి అంత ఉదయాన్నే స్టార్ట్ చేయడం కష్టం.

కానీ ఇప్పుడు ఎఎఎ సినిమాస్ వున్న మాల్ చిన్నది. పైగా క్రూషియల్ సెంటర్ లో వుంది. అందువల్ల మార్నింగ్ నే ఓపెన్ చేస్తారు. ఈ కారణంగా 9 గంటలకే షో వేయడం సాధ్యమవుతుందని తెలుస్తోంది. అన్ని విధాలా సెంటర్ లో వుండడం, ఉదయం ఆటలు వేసే అవకాశం వుండడంతో ఇప్పుడు ఎఎఎ సినిమాస్ అట్రాక్షన్ గా మారబోతోంది. దీని వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ ప్రసాద్స్ మీదే పడుతుంది. ఆపై ఎఎంబి మీద కూడా పడుతుంది.

సినిమా కార్యక్రమాలు అన్నీ ఇకపై ఎఎంబి, ప్రసాద్ లో కన్నా ఎఎఎ లో జరగడానికి ఎక్కువ అవకాశం వుంది. పాటలు, ట్రయిలర్లు, టీజర్ల విడుదల, సినిమాల ప్రదర్శన ఇవన్నీ ఇక్కడకు మారే అవకాశం వుంది. సినిమా మిడ్ రేంజ్ సెలబ్రిటీలు అంతా ప్రసాద్ బదులు ఇటు బాట పట్టే అవకాశం వుంది. 

ఎటొచ్చీ ఒకటే సమస్య. ఎఎఎ సినిమాకు వెళ్లే దారి వన్ వే. పైగా చాలా ఇరుకు. రోజంతా ట్రాఫిక్ ఇబ్బందే. ఇప్పుడు ఇలాంటి చోట అయిదు స్క్రీన్ లు ఓపెన్ కావడంతో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం వుంది.