ఈడీ అరెస్ట్.. కుప్పకూలిన మంత్రి!

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రిని అరెస్టు చేసినట్లు…

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న బాలాజీపై జాబ్స్‌ స్కామ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఈడీ విచార‌ణ‌కు గ‌తంలో సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కారూర్ జిల్లాకు చెందిన డీఎంకే నేత అయిన బాలాజీ ఇప్పుడు పార్టీలో కీల‌కంగా మారారు. ప్ర‌స్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 

రాజకీయ క‌క్ష‌ల్లో భాగంగా ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌పై కేంద్రం ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌నుల‌ను వాడుతోంద‌ని.. కేంద్రం బెదిరింపుల‌కు భయపడేది లేదంటోంది స్టాలిన్ ప్ర‌భుత్వం. కాగా గత నెలలో బాలాజీ సన్నిహితుల నివాసాల్లో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది.. కరూర్ లోని బాలాజీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లిన ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడులు జ‌రిగాయి .