మళ్లీ అదే సీన్ రిపీట్.. కాక్ పిట్ లో గర్ల్ ఫ్రెండ్

ఒక అనుభవం ఎదురైన తర్వాత ఎవరైనా జాగ్రత్త పడతారు. కానీ ఎయిరిండియా పైలట్లు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మొన్నటికిమొన్న కాక్ పిట్ లోకి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లాడు పైలట్.…

ఒక అనుభవం ఎదురైన తర్వాత ఎవరైనా జాగ్రత్త పడతారు. కానీ ఎయిరిండియా పైలట్లు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మొన్నటికిమొన్న కాక్ పిట్ లోకి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లాడు పైలట్. ఆమెకు సకల మర్యాదలు చేశాడు. క్యాబిన్ క్రూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దీనిపై విచారణ జరిపిన ఎయిరిండియా, పైలట్ ను విధుల నుంచి తప్పించింది. అంతేకాదు, దీనికి సంబంధించి డీజీసీఏ ఆగ్రహానికి కూడా గురైంది. ఏకంగా 30 లక్షలు జరిమానా చెల్లించింది.

ఇంత జరిగిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనలు రిపీట్ అవుతాయని ఊహించాం. కానీ ఎయిరిండియాలో మళ్లీ అదే రిపీటైంది. ఢిల్లీ నుంచి లెహ్ వెళ్తున్న విమానంలో, కాక్ పిట్ లోకి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొచ్చాడు పైలెట్. పక్కనే కో-పైలట్ కూడా ఉన్నాడు. విమానం గాల్లో ఎగురుతున్నంత సేపు కాక్ పిట్ లోనే ఉంది ఆ మహిళ.

ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్పందించింది ఎయిరిండియా. కాక్ పిట్ లో ఆ టైమ్ లో ఉన్న ఇద్దరు పైలట్ల లైసెన్సులు రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన ఎయిరిండియా, ఇకపై ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా ఉపేక్షించేది లేదని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

జరిగిన ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. ఎయిరిండియాలో జరిగిన ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం దీనిపై అంతర్గత విచారణ సాగుతోందని స్పష్టం చేసింది.