వేసిన పిటిషన్ ఏంటి? చేసిన వాదన ఏంటి?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. ఎవరు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారో.. ఎవరు నిజాలు రాబట్టాలనుకుంటున్నారో, నిజాలు దాచాలనుకుంటున్నారో ఏమీ సామాన్యుడికి బోధపడడం లేదు.  Advertisement ఈ కేసుకు సంబంధించి.. హత్యలో…

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. ఎవరు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారో.. ఎవరు నిజాలు రాబట్టాలనుకుంటున్నారో, నిజాలు దాచాలనుకుంటున్నారో ఏమీ సామాన్యుడికి బోధపడడం లేదు. 

ఈ కేసుకు సంబంధించి.. హత్యలో పాల్గొన్న వారిని, హత్య సమాచారం ముందే తెలిసిన వ్యక్తులుగా మరికొందరిని సీబీఐ అరెస్టు చేసి, చివరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరుచేసింది. ఆయన ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు.

ఇది పూర్వరంగం కాగా, అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని, ఆయనను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా దర్యాప్తు సంస్థ సీబీఐను వెంటనే ఆదేశించాలని కోరుతూ.. వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అది మంగళవారం నాడు విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా సునీత స్వయంగా తన తరఫు వాదనలు వినిపించుకుంది. ఒకవైపు న్యాయమూర్తి ఆమెను హెచ్చరించారు. తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తే, న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవడం వల్ల మీరు నష్టపోవచ్చు. తర్వాత ఈ కేసులో వచ్చే లాయరుకు ఇబ్బంది అవుతుంది. మేం మీ పిటిషన్ ను కొట్టేస్తే ఇబ్బంది అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

అయితే వివేకా హత్య సంగతి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు ముందే తెలుసునని సునీత సుప్రీం కు నివేదించినట్లు వార్తలు వస్తున్నాయి. బెయిల్ రద్దు కోసం ఆమె చాలా వాదించారు. అలాగే ఈ పిటిషన్ లో సీబీఐను కూడా జత చేయాలని డిమాండ్ చేశారు. 

సునీత విజ్ఞప్తులు వేటికీ కోర్టు ఒప్పుకోలేదు. అసలు ఈ కేసును అత్యవసరంగా వినాల్సిన అవసరమే లేదని తేల్చేసిన కోర్టు ఆ తర్వాత సునీతకు సహాయకుడిగా వ్యవహరించిన సీనియర్ లాయర్ లూథ్రా అనేక అంశాలు వివరించిన తరువాత.. వచ్చే సోమవారం 19వ తేదీన తదుపరి వాదనలు వినేందుకు నిర్ణయించింది.

అయితే తండ్రిని కోల్పోయిన సునీత పట్ల సానుభూతి ఉన్న ప్రజల్లో కూడా.. ఆమె సుప్రీం ఎదుట వినిపించిన వాదనలు చాలా ఘోరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే.. వేసిన పిటిషన్ అవినాష్ కు ఇచ్చిన బెయిలు రద్దు చేయడం గురించి! హత్య సంగతి జగన్ కు ముందే తెలుసా లేదా అనే విషయానికి ఈ పిటిషన్ తో ఏమైనా సంబంధం ఉందా? అని జనం అనుకుంటున్నారు. 

ఇలా సుప్రీం కోర్టును దారి మళ్లించేలా వాదనలు వినిపించినందుకే.. కేసు వాయిదా పడిందని.. ప్రజలు అంటున్నారు. మరి సునీత ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.