ఆదిపురుష్ ఓటిటి-ఎనిమిది వారాల తర్వాతే

ఆదిపురుష్ సినిమా ఎప్పుడు ఓటిటి లోకి వస్తుంది. ఇదీ క్వశ్చను. ఎనిమిది వారాలు అంటే రెండు నెలల తరువాతే. ఇది నిజంగా బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు బిగ్ రిలీఫ్.  Advertisement పోస్ట్ సమ్మర్ లో వస్తోంది…

ఆదిపురుష్ సినిమా ఎప్పుడు ఓటిటి లోకి వస్తుంది. ఇదీ క్వశ్చను. ఎనిమిది వారాలు అంటే రెండు నెలల తరువాతే. ఇది నిజంగా బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు బిగ్ రిలీఫ్. 

పోస్ట్ సమ్మర్ లో వస్తోంది ఆదిపురుష్ సినిమా. ఈ సినిమా విడుదలకు దాదాపు నెల రోజులుగా థియేటర్లు అన్నీ ఖాళీగా వున్నాయి. మళ్లీ అలాగే ఆదిపురుష్ విడుదలైన నాలుగు వారాల తరువాత కానీ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విడుదల కావడం లేదు. ఈ మధ్యలో అన్నీ చిన్న సినిమాలే.

అద్భుతమైన టాక్ తెచ్చుకుంటే తప్ప ఈ చిన్న సినిమాలు ఏవీ ఆదిపురుష్ కు పోటీ ఇచ్చేవి కాదు. లేదా ఆదిపురుష్ మరీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే. అందువల్ల ఎనిమిది వారాల గ్యాప్ అన్నది బాగా కలిసి వచ్చే అంశం. పైగా ఆంధ్ర, తెలంగాణ లో టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. తొలివారం అంతా ఈ కొత్త రేట్లు వుంటాయి. అందువల్ల ఫ్యాన్స్ కాని వారు, సినిమా ను తొలివారమే చూడాలనే తపన లేని వాళ్లు మలివారం నుంచే థియేటర్ కు వస్తారు.

తొలివారం మ్యాడ్ రష్ అయిపోతే మలివారం రెగ్యులర్ రష్ వుంటుంది. దీనికి తోడు ఆదిపురుష్ సినిమాకు సెంటిమెంట్ అద్దకం బలంగా జరుగుతోంది. వాట్సాప్ లో ఆదిపురుష్ సినిమా చూడడానికి గైడ్ లైన్స్ అంటూ కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. 

శుచిగా, శుభ్రతగా, చాలా పరమ పవిత్రంగా, భక్తిభావంతో సినిమాకు రావాలని సూచనలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ, ఇవన్నీ కలిసి సినిమా మీద బజ్ పెంచుతూ, సెంటిమెంట్ ను బలంగా మారుస్తున్నాయి. నిజంగా ఈ సెంటిమెంట్ బలంగా మారితే సినిమా ఎక్కడో వుండే అవకాశం వుంది.