టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ

ఏపీలో బీజేపీ ఎవరి కొమ్ము కాస్తుంది. ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది అన్న సవాలక్ష సందేహాలు ఉన్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేక సోలో ఫైట్ చేస్తుందా ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో…

ఏపీలో బీజేపీ ఎవరి కొమ్ము కాస్తుంది. ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది అన్న సవాలక్ష సందేహాలు ఉన్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేక సోలో ఫైట్ చేస్తుందా ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో జేపీ నడ్డా అమిత్ షా వైసీపీ మీద ఘాటు విమర్శలు చేసిన తరువాత ఈ డౌట్లు ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వాటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమాధానం ఇచ్చారు.

మేము ఎవరికీ అండగా ఉండబోమని స్పష్టం చేశారు. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదుగుతుంది. బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుంది అని జీవీఎల్ అంటున్నారు. ఏపీలో తాము ప్రధాన ప్రతిపక్షంగా వచ్చే ఎన్నికల తరువాత ఎదగాలన్నదే లక్ష్యమని జీవీఎల్ చెప్పారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ వెళ్లదని జీవీఎల్ చెప్పకనే చెబుతున్నారు. ఏపీలో బీజేపీ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది, తామే ఏపీలో రాజకీయాన్ని మార్చే శక్తిగా మారుతుందని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఇప్పటికిపుడు బలం, లేదు, 2024 ఎన్నికల నాటికి హఠాత్తుగా పెరిగే చాన్స్ లేదు. పొత్తులు లేకపోతే మళ్లీ నోటాతో పోటీ పడాల్సిందే. 

అయితే జీవీఎల్ మాత్రం తొమ్మిదేళ్ళుగా ఏపీని పాలించిన రెండు ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ పోరాడుతుందని అంటున్నారు. బీజేపీ ఏపీలో కీలక శక్తి కావాలని చూస్తోందని అంటున్నారు. జేపీ నడ్డా, అమిత్ షా సభల వెనక ఉన్న అసలు విషయం అదే అయితే మాత్రం ఏపీలో టీడీపీకి బీజేపీ దొరకదు, టీడీపీతో జనసేన పొత్తు కన్ ఫర్మ్ చేసుకోవాల్సిందే అంటున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అంటే టీడీపీ ప్లేస్ ని రీప్లేస్ చేయడమే అంటున్నారు.