సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్సే సూపర్ హిట్…!

దేశంలో ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్ 3న జాతకాలు బయటకు వస్తాయి. ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది డిసెంబర్…

దేశంలో ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్ 3న జాతకాలు బయటకు వస్తాయి. ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది డిసెంబర్ 3న వచ్చే ఫలితాలతో లెక్క తేలుతుంది. ఒక విధంగా లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ లో జరుగుతాయంటే దానికి ముందు సెమీ ఫైనల్స్ గా ఈ ఎన్నికలను భావించాలని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు.

దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయ సంగ్రామం ఉంది. అలాగే ఎండీయే వర్సెస్ ఇండియా కూటమిగా రెండు శిబిరాలు మోహరించి ఉన్నాయి. దాంతో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఎవరికి మొగ్గు అన్నది ఏ సర్వే చెప్పని విధంగా  నిక్కచ్చిగా ఫలితలు చెబుతారు. ప్రజలే ఏ పార్టీ సీన్ ఏంటో కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. 

ఇక చూస్తే ఉత్తరాది బెల్ట్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఇందులో ఒక చోట బీజేపీ అధికారంలో ఉంటే మరో రెండింట కాంగ్రెస్ ఉంది. ఇక సౌత్ లో తెలంగాణా ఈశాన్యంలో మిజోరాం స్టేట్స్ కి ఎన్నికలు ఉన్నాయి. నార్త్ బెల్ట్ లో అంటే రాజషాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ కలుపుకునిమొత్తం 520 శాసనసభ సీట్లు ఉంటే 2018లో ఇక్కడ  కాంగ్రెస్   282 సీట్లను 54.2 విన్నింగ్ పర్సెంటేజ్ తో గెలుచుకుంది.

అదే బీజేపీ చూస్తే కనుక 197 సీట్లను 37.8 విన్నింగ్ పర్సెంటేజ్ తో గెలుచుకుంది. ఇక ఈ అయిదింటిలోనూ కలుపుకుని చూస్తే కనుక 683 సీట్లు ఉంటే అందులో 305 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 199 సీట్లను గెలుచుకుందని టైంస్ ఆఫ్ ఇండియా విశ్లేషించింది. అంటే అయిదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనే బీజేపీ హవా బాగా తగ్గి కాంగ్రెస్ ఎక్కువ సీట్లను ఓట్లను కైవశం చేసుకుందని, ఇక ఇపుడు చూస్తే దాని కంటే మెరుగైన ఫలితాలు కాంగ్రెస్ కి వస్తాయని అంటోంది.

అంటే కాంగ్రెస్ కే మొత్తం అయిదింటిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెబుతోంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వేసిన అంచనా. ఆ అంచనా ప్రకారం చూస్తే కనుక రాజస్థాన్ లో మరోసారి, మధ్యప్రదేశ్ లోనూ చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని భావించాల్సి ఉంటుంది. 

ఇక తెలంగాణాలో కాంగ్రెస్ కి విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా టోటల్ గా చెప్పుకుంటే అయిందింట్లో కూడా కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టే చాన్స్ ఉందని టైంస్ ఆఫ్ ఇండియా అంటోంది. చూడాలి మరి నిజంగా అది జరుగుతుందా కాగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కుతుందా అన్నది.