ఆదిపురుష్-అడ్వాన్స్ ల తకరారు

ఆదిపురుష్ నైజాం బుకింగ్ తలుపులు ఇంకా తెరుచుకోలేదు. సమస్య ఒకటే. ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్స్ లు రావడం అన్నది సమస్య. ఈ సమ్మర్ అంతా థియేటర్ల అడ్వాన్స్ ల దగ్గరే. నైజాం లో థియేటర్ల…

ఆదిపురుష్ నైజాం బుకింగ్ తలుపులు ఇంకా తెరుచుకోలేదు. సమస్య ఒకటే. ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్స్ లు రావడం అన్నది సమస్య. ఈ సమ్మర్ అంతా థియేటర్ల అడ్వాన్స్ ల దగ్గరే. నైజాం లో థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాస్త గట్టి అడ్వాన్స్ ఆశిస్తున్నారు. ఈ సమ్మర్ అంతా థియేటర్లకు సరైన బిజినెస్ జరగలేదు. అందువల్ల అంత ఇవ్వలేము అన్నది ఎగ్జిబిటర్ల పాయింట్.

నైజాంలో బిగ్ ప్లేయర్ ఆసియన్ సునీల్/సురేష్ బాబు. వీళ్లదే 30శాతం వాటా. వీళ్లని పాతిక కోట్ల వరకు అడ్వాన్స్ అడుగుతున్నారు. అంత ఇవ్వలేమని, ఈ సమ్మర్ లో అంతా డెఫిసిట్ అని వాళ్ల వాదన. 50 ప్లస్ 10 కోట్ల లెక్కన సినిమా కొన్నాము కనుక ఆ మేరకు అడ్వాన్స్ కావాలన్నది బయ్యర్ పాయింట్. చిన్న షేర్ వున్న దిల్ రాజు ను పది కోట్ల వరకు అడుగుతున్నారని తెలుస్తోంది.

మరో ముపై శాతం వాటా మల్టీ ఫ్లెక్స్ లది. మరో ముఫై శాతం వాటా సింగిల్ స్క్రీన్ లది. సింగిల్ స్క్రీన్ జనాలు చాలా మంది చేతులు ఎత్తేస్తున్నారు. దిల్ రాజు 10 కోట్లు, ఆసియన్ సంస్థ 25 కోట్లు ఇస్తే ఇంకో 25 కోట్ల అడ్వాన్స్ లు మల్టీ ఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ ల మీద లాగాల్సి వుంటుంది. లేదూ అంటే బయ్యర్ తన చేతి నుంచి కొంత అమౌంట్ సర్దుబాటు చేయాల్సి వుంది.

ఈ రోజ ఈ లెక్క ఎలాగైనా సెట్ కావాల్సి వుంది. లేదూ అంటే బుధవారం కూడా బుకింగ్ లు ఓపెన్ కాకుంటే అంత బాగోదు.