ఆర్ఆర్ఆర్ ఓటిటిలో ఎప్పుడు?

ఓటిటి….సినిమా ప్రేమికులకు ముఖ్యంగా మిడిల్ క్లాస్ జనాలకు వరం. థియేటర్ కు వెళ్లి ఇంటిల్లిపాదీ సినిమా చూడాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అదే అయిదువేలు ఖర్చు…

ఓటిటి….సినిమా ప్రేమికులకు ముఖ్యంగా మిడిల్ క్లాస్ జనాలకు వరం. థియేటర్ కు వెళ్లి ఇంటిల్లిపాదీ సినిమా చూడాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అదే అయిదువేలు ఖర్చు చేస్తే ఏడాది పొడవునా అన్ని ఓటిటి ల సభ్యత్వాలు వచ్చేస్తాయి. ఎన్ని సినిమాలు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. 

అందుకే ఆహా, అమెజాన్, హాట్ స్టార్ లాంటివి పల్లెలకు కూడా పాకేసాయి. ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్. ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ వచ్చేసాయి. పన్నెండు వేలు ఖర్చు చేస్తే 32 అంగుళాల స్మార్ట్ టీవీ దొరికేస్తోంది. దాంతో పల్లెల్లోని డెభై శాతం ఇళ్లలో ఇవే వుంటున్నాయి. పశువులు కాసుకునే కుర్రాళ్లు, ఇసుక ఇటుక మోసే కూలీలు కూడా తీరిక వేళల్లో స్మార్ట్ ఫోన్ లతో సేద తీరుతున్నారు. యూ ట్యూబ్ ను అపరిమితంగా వాడుతున్నారు. డేటా అన్నది లెక్కలేకుండా అయిపోయింది.

పుష్ప..అఖండ..భీమ్లా నాయక్…సినిమాలు విడుదలయిన తరువాత యాభై రోజుల లోపే ఓటిటిలోకి వచ్చేసాయి. ఆడవాళ్లూ మీకు జోహార్లు రాబోతోంది. రాధేశ్యామ్ అతి కొద్ది రోజుల్లో ఓటిటి లోకి రాబోతోంది. 

ఇంతకీ ఆర్ఆర్ఆర్ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుంది? 

ఈ ప్రశ్నకు అధికారికంగా సమాధానం అయితే లేదు. కానీ కోట్లకు కోట్లు వెచ్చింది జీ టీవీ ఈ సినిమా డిజిటల్, టీవీ రైట్స్ తీసుకుంది. అందువల్ల ఎప్పడో మూడు నెలల వరకు వేచి వుంటుందా? సమస్యే లేదు. మిగిలిన అన్ని సినిమాల మాదిరిగా ముఫై రోజుల్లో రావచ్చు.. రాకపోవచ్చు. యాభై రోజులకు అయితే వచ్చే అవకాశం వుందని సినిమా జనాలు అంచనా వేస్తున్నారు. 

ఆ విధంగా యాభై రోజులకు రావాల్సి వుంటే కనుక మే తొలి వారంలో ఓటిటిలో ప్రత్యేక్షమయ్యే అవకాశం వుంది. లేదూ పుష్ప మాదిరిగా అదనపు పేమెంట్ ఒప్పందాల్లాంటివి కుదిరితే అంతకన్నా ముందే రావచ్చేమో? మొత్తం మీద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అన్నది వాస్తవం.