అసెంబ్లీకి వెళ్లే ముందు మద్యం బాటిళ్లతో నిరసన, అసెంబ్లీలోకి చిడతలతో ఎంట్రీ, ఎమ్మెల్యేలు పదే పదే రెచ్చిపోవడం, పేపర్లు చించేసి పోడియం చుట్టూ చేరిపోవడం.. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కామెడీపై జనానికే విసుగొచ్చేస్తోంది. మేటర్ లేకే ఇలాంటి మెటీరియల్ అసెంబ్లీలో సందడి చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చినబాబు ఈ టీమ్ కి నాయకత్వం వహిస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యేలు మరీ కుప్పిగంతులు, చిల్లర వేషాలు వేస్తున్నారు.
ప్రతి రోజూ కొత్త ప్లకార్డులు రాసుకోవడం, జే బ్రాండ్స్ అంటూ రెచ్చిపోవడం, చివరకు సీఎం జగన్ చిత్రపటంపై మద్యం పోసి రాక్షసానందాన్ని పొందడం.. ఇవీ తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ వేస్తున్న చిల్లర వేషాలు. ఈ చిల్లర చేష్టలు చూడలేక జనాలకి విసుగొచ్చేస్తోంది. పదే పదే ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతల్ని రెచ్చగొడుతూ ప్రచారం కోరుకుంటున్నారు టీడీపీ నేతలు.
ప్రజా సమస్యలను ప్రస్తావించడం, నిర్మాణాత్మకమైన ఆరోపణలు చేయడం గాలికొదిలేసింది టీడీపీ బ్యాచ్. కేవలం జె-బ్రాండ్ అంటూ పట్టుకుని ఊగులాడుతోంది. వాటికి అనుమతులు టీడీపీ హయాంలోనే వచ్చాయని నిర్థారణ కావడంతో ఆ తప్పుని కప్పి పుచ్చుకోడానికి మరింతగా రెచ్చిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.
చినబాబు ఫెయిల్..
అడ్డదారిలో మంత్రి పదవి సంపాదించిన నారా లోకేష్, నేరుగా జనం ఓట్లతో గెలవలేరని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ మందకు నాయకుడిగా కూడా ఆయన ఫెయిలయ్యారు. చంద్రబాబు తెలివిగా సమావేశాలకు మొహం చాటేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా లోకేష్ నాయకత్వంలో ఎలా ప్రవర్తిస్తారు, అసలు లోకేష్ వీరిని కంట్రోల్ చేయగలరా లేదా అనే విషయంపై ఆయన తాజా సమావేశాలను ప్రయోగానికి వాడుకుంటున్నారు.
కానీ లోకేష్ ఈ ప్రయోగంలో ఫెయిలయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి తప్పితే ప్రజల్ని ఆలోచింపజేసేవిగా లేవు. హుందా రాజకీయాలు చేయడం చేతకాదని మరోసారి టీడీపీ నిరూపించుకున్నట్టయింది.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలలో ఎవరికీ విషయం లేదు కాబట్టి, ఏ విషయంపై కూడా సాధికారికంగా మాట్లాడే జ్ఞానం లేదు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. సభలో మాట్లాడే దమ్ములేక, ఇలా సభ బయట రచ్చ చేస్తున్నారు, అనుకూల మీడియా ద్వారా ప్రచారం పొందుతున్నారు. మొత్తానికి చంద్రబాబు లేకుండా టీడీపీ టీమ్ ఎన్ని కుప్పిగంతులు వేస్తుందో ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది.