జనసేనలోకి ప్రముఖ నిర్మాత!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ‌ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీవీఎస్ఎన్ ప్రసాద్ ని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్ పార్టీలోకి…

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ‌ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీవీఎస్ఎన్ ప్రసాద్ ని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీకి సేవ మాత్రమే చేస్తారా లేక పోత్తుల్లో భాగంగా జనసేన తరపున పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్ర‌సాద్ ఇటీవ‌లే విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. గ‌తంలో పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించారు. 

కాగా ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ యాగం చేపట్టారు. ఈ యాగంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాతలు వై.రవిశంకర్, డీవీవీ దానయ్య, ఎ.ఎం.రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ యాగశాలను సందర్శించారు.