సంక్రాంతి పోటీ షురూ!

2024 సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి. ఇది ఇప్పటికిప్పుడే క్లారిటీగా జవాబు చెప్పగల ప్రశ్న కాదు. వచ్చినా, రాకపోయినా ప్రస్తుతానికి రెండు భారీ సినిమాలు సంక్రాంతికి డేట్ లు ఇచ్చేసాయి.  Advertisement మహేష్ బాబు-త్రివిక్రమ్…

2024 సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి. ఇది ఇప్పటికిప్పుడే క్లారిటీగా జవాబు చెప్పగల ప్రశ్న కాదు. వచ్చినా, రాకపోయినా ప్రస్తుతానికి రెండు భారీ సినిమాలు సంక్రాంతికి డేట్ లు ఇచ్చేసాయి. 

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఒకటి, ఇప్పటికి ముందే ప్రారంభమైనా, అది చాలా చిన్న షెడ్యూలు జరిగింది. అసలు షూటింగ్ మొత్తం బకాయే వుంది. ఈ నెల 20 న ప్రారంభమై ఆరు నెలల్లో పూర్తి చేసుకుని, సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ లాంటి భారీ కాంబినేషన్ లో సినిమా ఆరు నెలల్లో పూర్తి కావడం అంటే సవాల్ కిందే లెక్క.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా కూడా సంక్రాంతికి అనే ప్రకటించారు. దీనికి కూడా ఇంకా చాలా భారీ షూట్, టెక్నికల్ వర్క్, ఇంకా చాలా అంటే చాలా వున్నాయి. ఇవన్నీ ఆరునెలల్లో పూర్తి చేసుకుని సంక్రాంతికి రావాల్సి వుంది.

ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ఈగిల్ కూడా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ నటించిన ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.

ఇలా మొత్తం మూడు సినిమాలు 2024 సంక్రాంతికి రెడీ అవుతుంటే, ఇంకా ప్రారంభం కాని నాగ్-బెజవాడ ప్రసన్న సినిమా కూడా సంక్రాంతి అన్నది దృష్టిలో పెట్టుకునే ప్లానింగ్ దిశగా అడుగులు వేస్తోంది.