భీమా.. గోపీచంద్ కొత్త సినిమా ఇదే

రామబాణం సినిమాతో కేవలం ఫ్లాప్ అందుకోవడమే కాకుండా, తన స్టోరీ సెలక్షన్ కు సంబంధించి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు గోపీచంద్. ఇప్పుడీ హీరో నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు భీమా అనే…

రామబాణం సినిమాతో కేవలం ఫ్లాప్ అందుకోవడమే కాకుండా, తన స్టోరీ సెలక్షన్ కు సంబంధించి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు గోపీచంద్. ఇప్పుడీ హీరో నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు భీమా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ విషయానికొస్తే, భీమా సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. అతడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయాన్ని సింబాలిక్ గా చెప్పేందుకు, బ్యాక్ గ్రౌండ్ లో పోట్లగిత్తను చూపించారు. అతడి ముఖంపై గాట్లు కూడా ఉన్నాయి. కన్నడ ఫిలిం మేకర్ హర్ష, ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మాతగా తెరకెక్కుతోంది భీమా సినిమా. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

గడిచిన కొన్నేళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు గోపీచంద్. మారుతి దర్శకత్వంలో అతడు చేసిన పక్కా కమర్షియల్ సినిమా పక్కా డిజాస్టర్ అయింది. రీసెంట్ గా వచ్చిన రామబాణం సినిమా కూడా  అతిపెద్ద డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో భీమా సినిమాతో తన మార్కెట్ ను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు గోపీచంద్.