అమరావతి అడ్రస్ మరచిపోయిన చంద్రబాబు

చంద్రబాబు ఎంతటి అవకాశవాదో, రాజకీయ స్వలాభం కోసం ఎలాంటి డ్రామాలు ఆడతారో.. పెద్ద పండగ మరోసారి రుజువు చేసింది. అవును.. సంక్రాంతి సాక్షిగా బాబు బండారం మొత్తం బైటపడింది.  Advertisement 2020 సంక్రాంతి పండగను…

చంద్రబాబు ఎంతటి అవకాశవాదో, రాజకీయ స్వలాభం కోసం ఎలాంటి డ్రామాలు ఆడతారో.. పెద్ద పండగ మరోసారి రుజువు చేసింది. అవును.. సంక్రాంతి సాక్షిగా బాబు బండారం మొత్తం బైటపడింది. 

2020 సంక్రాంతి పండగను చంద్రబాబు అమరావతి రైతులతో కలసి జరుపుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అమరావతికి అన్యాయం చేశారని, కనీసం రైతుల్ని సంక్రాంతి పండగ జరుపుకోకుండా చేశారని, వారి జీవితాల్లో చీకట్లు నింపారని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

కట్ చేస్తే.. 2021లో అదే అమరావతి ఉద్యమం అక్కడే కొనసాగుతోంది, టెంట్లు అలాగే ఉన్నాయి, ప్లకార్డులు, బోర్డులు అలాగే కనిపిస్తున్నాయి, ఉద్యమం పేరుతో కొంతమంది చేస్తున్న హడావిడిలో కూడా ఏమార్పు లేదు. కానీ మారిందల్లా చంద్రబాబు మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతి కోసం బాబు కృష్ణాజిల్లా పరిటాల బాట పట్టారు. అక్కడే భోగి మంటలు వేసుకుని, ప్రభుత్వ జీవోల్ని తగలబెడుతున్నామంటూ తన కడుపుమంట బయటపెట్టుకున్నారు.

పరిటాలలో బాబు భోగిమంట బాగానే ఉంది, మరి అమరావతి రైతుల సంక్రాంతి ఏమైంది?

ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదు కాబట్టి బాబు దృష్టిలో అక్కడి రైతులకు ఇంకా పండగ రానట్టే లెక్క. మరి చంద్రబాబు అమరావతి దీక్షా శిబిరానికి వెళ్లి.. వారిని ఓదార్చాలి కదా. ఈ ఏడాది కూడా పండగ లేకుండా చేశారంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి కదా. 

బాబుకెందుకో అమరావతి గుర్తు రాలేదు, అసలు కొన్ని రోజులుగా రాజధాని అడ్రస్ మర్చిపోయి, విజయనగరం-విశాఖపట్నం అంటూ తిరుగుతున్నారాయన. అందుకే సంక్రాంతి పండక్కి కూడా అమరావతి టెంట్ ల వైపు కన్నెత్తి చూడలేదు.

అమరావతికి దూరంగా బాబు అడుగులు..

గ్రాఫిక్స్ రాజధాని కోసం నానా హంగామా చేసిన చంద్రబాబు.. అమరావతి అజెండాతో అంతా మారిపోతుందని అనుకున్నారు. కానీ తనని కేవలం అమరావతికి మాత్రమే పరిమితం చేస్తున్నారనే విషయాన్ని తొందరగానే గ్రహించారు. అందుకే రాజధాని ప్రాంతంలో తాను మొదలు పెట్టించిన ఉద్యమానికి చివరికి తానే దూరమయ్యారు బాబు.

గతేడాది సంక్రాంతికి తన భార్య చేతికి ఉన్న రెండు బంగారు గాజులు దానం చేయించి.. జోలె పట్టి ఊరూరా తిరిగి డబ్బులతో పాటు అమరావతికి మద్దతు కూడా కూడబెడతానంటూ ప్రగల్భాలు పలికిన బాబు కరోనా దెబ్బతో పూర్తిగా హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. 

ఆ తర్వాత క్రమక్రమంగా అమరావతికి దూరమయ్యారు. రైతులంటే కేవలం అమరావతి రైతులేననే భ్రమలో నుంచి బయటపటి, రాష్ట్ర రైతులందరి తరపున వకాల్తా పుచ్చుకున్నారు.

కానీ ఇది కూడా బాబు డ్రామాలో ఓ భాగం మాత్రమే. అప్పుడు అమరావతి రైతులపై కపట ప్రేమను ఎలా చూపించారో.. ఇప్పుడు రాష్ట్ర రైతాంగంపై అలాంటి ప్రేమనే బయటపెడుతున్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా ఆంధ్రప్రదేశ్ రైతులు ఆయన్ని ఈ జన్మలో నమ్మరు. 

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

మంచి కిక్‌ ఇచ్చారు