Advertisement

Advertisement


Home > Movies - Movie News

శృతిపై నెగెటివ్ కామెంట్స్.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ

శృతిపై నెగెటివ్ కామెంట్స్.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ

క్రాక్ హిట్టయింది. అంతా హ్యాపీ. కానీ శృతిహాసన్ మాత్రం దీనికి మినహాయింపు. ఆమె లుక్ పై చాలా విమర్శలు పడుతున్నాయి. సినిమాలో ఆమెను తల్లిగా చూపించేందుకు అలా మేకప్ చేశారా.. లేక నిజజీవితంలో శృతిహాసనే అలా మారిపోయిందా అనే అంశాన్ని పక్కనపెడితే.. శృతి మాత్రం సినిమాలో గ్లామరస్ గా కనిపించలేదనేది అందరి కామన్ పాయింట్.

ఇప్పుడీమె నుంచి త్వరలోనే మరో సినిమా రాబోతోంది. అదే వకీల్ సాబ్. ఈ విమర్శలు వకీల్ సాబ్ లో కూడా కొనసాగుతాయని చాలామంది భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ఒకింత అనుమానం, భయం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ కు శృతిహాసన్ మైనస్ అవుతుందేమో అనే టెన్షన్ వాళ్లలో ఉంది.

అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో ఆ టెన్షన్ కాస్త తగ్గింది. దీనికి కారణం సినిమాకు సంబంధించి శృతిహాసన్ స్క్రీన్ టైమ్ పై క్లారిటీ రావడమే.

సినిమాలో శృతిహాసన్ చాలా తక్కువ టైమ్ మాత్రమే కనిపిస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ ఈ విషయాన్ని బయటపెట్టింది కూడా. తనది దాదాపు ఓ గెస్ట్ రోల్ మాత్రమే అని ప్రకటించింది. పైగా వకీల్ సాబ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శృతిహాసన్ వస్తుంది.

కాబట్టి శృతిహాసన్ అందంపై మరోసారి విమర్శలు చెలరేగినప్పటికీ.. ఆ ప్రభావం వకీల్ సాబ్ పై పడదనే ధీమాతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. దీనికితోడు పవన్-శృతిహాసన్ మధ్య తీయాల్సిన ఓ డ్యూయట్ ను కూడా షూట్ చేయకపోవడంతో, మూవీలో ఆమె నిడివి మరింత తగ్గిపోతుంది. కాబట్టి వకీల్ సాబ్ సినిమాను శృతి గ్లామర్ పెద్దగా ఇబ్బందిపెట్టదనేది ఫ్యాన్స్ ఫీలింగ్.

మంచి కిక్‌ ఇచ్చారు

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?