బాలయ్య @ 25 కోట్లు!

టాలీవుడ్ లో అందరి రెమ్యూనిరేషన్లు పెరుగుతూనే వున్నాయ్. కరోనా తరువాత ఓటిటి. నాన్ థియేటర్ హక్కులు పెరగడంతో నిర్మాత ఆదాయం పెరిగినా అది నిర్మాణ వ్యయం, హీరోల రెమ్యూనిరేషన్ దిశగా మళ్లుతోంది. నాన్ థియేటర్…

టాలీవుడ్ లో అందరి రెమ్యూనిరేషన్లు పెరుగుతూనే వున్నాయ్. కరోనా తరువాత ఓటిటి. నాన్ థియేటర్ హక్కులు పెరగడంతో నిర్మాత ఆదాయం పెరిగినా అది నిర్మాణ వ్యయం, హీరోల రెమ్యూనిరేషన్ దిశగా మళ్లుతోంది. నాన్ థియేటర్ ఆదాయం చూపించి, హీరోల రెమ్యూనిరేషన్లు పెరిగాయి. ఈ క్రమంలో కంపారిటివ్ గా చూసుకుంటే నందమూరి బాలయ్య రెమ్యూనిరేషన్ చాలా రీజనబుల్ అనే చెప్పుకోవాలి. అఖండ సినిమాకు ముందు బాలయ్య రెమ్యూనరేషన్ 10 కోట్ల దగ్గరే వుండేది.

బాలయ్య రెమ్యూనిరేషన్ స్టయిల్ డిఫరెంట్ గా వుంటుంది. సినిమా ఒప్పుకునే ముందు నామినల్ గా ఓ అమౌంట్ అనుకుంటారు. సినిమా విడుదల ముందు పరిస్థితి చూసి, దాన్ని తగ్గించడం లేదా పెంచడం అనేది వుంటుంది. అందువల్ల నిర్మాతకు కంఫర్టబుల్ గానే వుంటుంది. 

నాని, రవితేజ లాంటి వాళ్లు ఏనాడో ఇరవై కోట్లు దాటేసారు. కానీ బాలయ్య వీరసింహారెడ్డి కి కూడా 15 కోట్లకు కాస్త అటు ఇటుగానే తీసుకున్నారు. ఇప్పుడు చేస్తున్న భగవంత్ కేసరి సినిమాకు కూడా అదే రేంజ్ లో సినిమా చేస్తున్నారు.

బట్, తొలిసారి 25 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. చాలా షార్ట్ టైమ్ లో మూడు, నాలుగు గ్యాప్ లో పూర్తి చేసే విధంగా డైరక్టర్ బాబీతో సినిమా ఒప్పుకున్నారు. ఈ సినిమాకు బాలయ్యకు హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ గా 25 కోట్ల మేరకు అందబోతోందని తెలుస్తోంది.

సీనియర్ హీరోల్లో మెగాస్టార్ 50 కోట్ల దగ్గర వున్నారు. రవితేజ 20 కోట్ల దగ్గర వున్నారు. నాగ్, వెంకీ పది కోట్ల లోపునే వున్నారు. ఇప్పుడు రెండు వరుస హిట్ ల తరువాత బాలయ్య కూడా 20 కోట్ల మార్క్ దాటేసారు.