సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ అందరికీ నచ్చాలని లేదు. కొన్ని హిట్ సాంగ్స్ కొందరికి నచ్చవు. ఎన్టీఆర్ కు కూడా నచ్చని సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అది నాగార్జున సినిమాలోనిది.
నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ ఘరానా బుల్లోడు. ఈ సినిమాలో భీమవరం బుల్లోడా అనే సాంగ్ కూడా పెద్ద హిట్. తర్వాత కాలంలో ఆ పాటను రీమిక్స్ కూడా చేశారు. ఇంత పెద్ద హిట్టయిన ఈ పాట తనకు మాత్రం నచ్చదంటున్నాడు తారక్.
“భీమవరం బుల్లోడా పాలు కావాలా అనే సాంగ్ నాకు అస్సలు నచ్చదు. బహుశా లిరిక్స్ వల్ల నచ్చదేమో. పైగా ఆ పాటలో వచ్చే హమ్మింగ్ అంటే నాకు చాలా ఇరిటేషన్.”
మరోవైపు రామ్ చరణ్ కూడా తనకు నచ్చని పాటను బయటపెట్టాడు. రీసెంట్ గా ఓ చిన్న సినిమా వచ్చిందని, దానికి కీరవాణి సంగీతం అందించారని, అందులో ఓ పాట తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు. పెళ్లిసందD సినిమాలో పాట అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు చరణ్.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి ఎదురుగా.. అతడు కంపోజ్ చేసిన చెత్త పాటల గురించి చరణ్-తారక్ ఇలా బయటపడ్డారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా ఈ హీరోలిద్దర్నీ కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఆ టైమ్ లో కీరవాణి కంపోజ్ చేసిన చెత్త పాటల గురించి హీరోలిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు.