తెలుగు సినిమా రీమేక్ లో అభిషేక్ బచ్చన్?

చాన్నాళ్లుగా మంచి బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీలో కూడా కనిపిస్తున్న ఈ నటుడు… ఇప్పుడు రీమేక్స్ పై కన్నేశాడు. అది…

చాన్నాళ్లుగా మంచి బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీలో కూడా కనిపిస్తున్న ఈ నటుడు… ఇప్పుడు రీమేక్స్ పై కన్నేశాడు. అది కూడా ఓ తెలుగు సినిమా రీమేక్ పై అభిషేక్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతోంది అరి మూవీ. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రయిలర్ తో ఆకట్టుకుంది. అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష లాంటి నటీనటులు నటించిన ఈ మూవీని, అభిషేక్ బచ్చన్ కు ప్రత్యేకంగా చూపించాడట దర్శకుడు.

ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే ఈ సినిమా రషెష్ చూశాడు అభిషేక్ బచ్చన్. మూవీ కాన్సెప్ట్ నచ్చి రీమేక్ లో నటించడానికి వెంటనే ఓకే చెప్పాడట. హిందీ రీమేక్ ను కూడా జయశంకరే డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

అరి సినిమాను ఆగస్ట్ లో ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా విడుదలకు ముందే రీమేక్ డీల్ లాక్ చేసుకుంది ఈ సినిమా.