గతంలో శ్రీరెడ్డి చేసిన ఆందోళన గురించి అందరికీ తెలిసిందే. ఫిలింఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ఆమె తన నిరసన తెలియజేసింది. ఆ తర్వాత తెలుగు ఆర్టిస్టులకు న్యాయం చేయాలంటూ ఉద్యమం లేపే ప్రయత్నం చేసింది. ఆ టైమ్ లో ఆమెకు అండగా నిలిచిన అతికొద్దిమంది సినీ ప్రముఖుల్లో దర్శకుడు తేజ ఒకరు.
శ్రీరెడ్డికి తను న్యాయం చేస్తానని ఆ టైమ్ లో బహిరంగంగా ప్రకటించారు తేజ. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ కూడా ఇస్తానన్నారు. కానీ ఇన్నేళ్లు గడిచినా శ్రీరెడ్డికి, తేజ ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా ఇదే ప్రశ్న తేజకు ఎదురైనప్పుడు, తను ఇచ్చిన మాట గుర్తుందని, ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తానని, మరోసారి మాటపై నిలబడ్డారు తేజ.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, అసలు మేటర్ ఇక్కడే ఉంది. ప్రాక్టికల్ గా చూస్తే.. ఇప్పట్లో శ్రీరెడ్డికి తేజ అవకాశం ఇవ్వలేరు.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస సినిమా డైరక్ట్ చేశారు తేజ. అందులో శ్రీరెడ్డికి నో ఎంట్రీ. ఎందుకనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీలో కూడా శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే, ఈసారి రానాతో సినిమా కాబట్టి.
దగ్గుబాటి కాంపౌండ్ కు, శ్రీరెడ్డికి మధ్య ఉన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సురేష్ బాబును మామ అని, రానాను బావగారు అంటూ శ్రీరెడ్డి లెక్కలేనన్ని వీడియోలు చేసింది. అందర్నీ దుమ్మెత్తిపోయింది. కాబట్టి తన నెక్ట్స్ మూవీలో కూడా శ్రీరెడ్డికి తేజ ఛాన్స్ ఇవ్వలేడు.