ఆర్ఆర్ఆర్ లో చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తనను ఆశ్చర్యపరిచాడంటున్నాడు దర్శకుడు రాజమౌళి. సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించినప్పటికీ.. చరణ్ మాత్రమే తనను ఆశ్చర్యపరిచాడని చెప్పుకొచ్చాడు జక్కన్న. దీనికి ఆయన చెప్పే లాజిక్…

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తనను ఆశ్చర్యపరిచాడంటున్నాడు దర్శకుడు రాజమౌళి. సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించినప్పటికీ.. చరణ్ మాత్రమే తనను ఆశ్చర్యపరిచాడని చెప్పుకొచ్చాడు జక్కన్న. దీనికి ఆయన చెప్పే లాజిక్ కూడా సహేతుకంగా ఉంది.

“ఎన్టీఆర్ గురించి నాకు పూర్తిగా తెలుసు. నా గురించి ఎన్టీఆర్ కు కూడా పూర్తి తెలుసు. నాకేం కావాలో ఎన్టీఆర్ కు బాగా తెలుసు. ఫ్రేమింగ్ నుంచి పాజింగ్ వరకు అన్నీ మనసులో నేను ఏం అనుకుంటానో అవన్నీ తారక్ చేసేస్తాడు. హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు. కానీ చరణ్ గురించి నాకు పూర్తిస్థాయిలో తెలియదు. దీంతో ఆర్ఆర్ఆర్ సెట్స్ లో కొన్ని సార్లు నన్ను ఆశ్చర్యపరిచాడు.”

రంగస్థలం సినిమాలో చరణ్ ను చూసిన తను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని.. ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి చరణ్ వచ్చిన తర్వాత ఆ ఆశ్చర్యం రెట్టింపు అయిందని అంటున్నాడు రాజమౌళి.

“సెట్స్ కు ఓ వైట్ పేపర్ లా వస్తాడు రామ్ చరణ్. ఓ పెద్ద కాన్వాస్ లా కనిపిస్తాడు. మనం దానిపై ఏ క్యారెక్టర్ చెక్కితే అలా మారిపోతాడు. ఒక్కోసారి షూటింగ్ లో నేను మనసులో అనుకోని ఎమోషన్స్ కూడా చూపించాడు రామ్ చరణ్. అవన్నీ చాలా బాగా వచ్చాయి. వాటిని నేను అలానే ఉంచాను.”

ఇక పాత్రల విషయానికొస్తే.. సీతారామరాజు పాత్రకు రిఫరెన్స్ గా పాత సినిమాలున్నాయి కానీ, భీమ్ పాత్రకు మాత్రం ఎలాంటి రిఫరెన్సులు లేవన్నాడు రాజమౌళి. కొన్ని పుస్తకాలు చదివి, ఎక్కువగా తనే ఊహించుకొని, తనే భీమ్ పాత్రకు రూపు తీసుకొచ్చానని చెప్పాడు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది ఆర్ఆర్ఆర్.