అఫీషియల్.. మెగా కాంపౌండ్ లో పెళ్లి బాజా

నిన్నటివరకు పుకారు, ఇప్పుడదే అధికారికమైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి…

నిన్నటివరకు పుకారు, ఇప్పుడదే అధికారికమైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి తేదీని ప్రకటిస్తారు.

వరుణ్, లావణ్య డేటింగ్ పై కొన్నాళ్లుగా ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ప్రారంభంలో వాటిని వీళ్లిద్దరూ ఖండించారు. ఒక దశలో లావణ్యకు వరుణ్ ప్రపోజ్ చేశాడనే విషయం కూడా మీడియాకెక్కింది. ఆ విషయాన్ని కూడా ఈ జంట ఖండించింది.

అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి ఎఫైర్ పై వచ్చిన పుకార్లను వీళ్లు ఖండించలేదు. మరీ ముఖ్యంగా ఎంగేజ్ మెంట్ అంటూ వచ్చిన వార్తల్ని కూడా వీళ్లు తప్పుబట్టలేదు. వీటికి మరింత ఊతమిస్తూ, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక, ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. దీంతో అంతా పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అదే ఇప్పుడు నిజమైంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. అయితే అంతకంటే ముందే వీళ్లిద్దరికీ పరిచయం. నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేవారు, కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయం. ఆ తర్వాత కలిసి సినిమాలు కూడా చేశారు.

స్నేహితులుగా ఉన్న వీళ్లు ప్రేమికులుగా ఎప్పుడు మారారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత, పెళ్లి తేదీని ప్రకటిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్య పెళ్లి ఉంటుంది.