రాయలసీమ రౌడీలు.. గుండాలు అనకపోతే చాలు లోకేషా!

విశాఖ రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తే ప్ర‌శాంతంగా ఉంటే విశాఖ‌లోకి రాయ‌ల‌సీమ రౌడీలు, గుండాలు వ‌స్తారు.. ఒక కుల సంఘం ప్ర‌భుత్వంపై క‌న్నెర్ర చేసి ధ‌ర్నాలు, ప్ర‌భుత్వ అస్తుల‌పై దాడులు చేస్తే అందులో ఎటువంటి ప్రమేయం లేని…

విశాఖ రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తే ప్ర‌శాంతంగా ఉంటే విశాఖ‌లోకి రాయ‌ల‌సీమ రౌడీలు, గుండాలు వ‌స్తారు.. ఒక కుల సంఘం ప్ర‌భుత్వంపై క‌న్నెర్ర చేసి ధ‌ర్నాలు, ప్ర‌భుత్వ అస్తుల‌పై దాడులు చేస్తే అందులో ఎటువంటి ప్రమేయం లేని చోట కూడా రాయ‌ల‌సీమ గుండాలు వ‌చ్చి విద్వాంసం చేశారు అంటూ నోటీకి వ‌చ్చిన‌ట్లు మాట్లాడిన‌ టీడీపీ నాయ‌కులు ఇప్పుడు రాయ‌ల‌సీమ‌పై ప్రేమ‌ను ఒలకబోస్తున్నారు.

రాయలసీమ రౌడీలు.. కడప గుండాలు అంటూ తిట్టిన‌ నోటితోనే రాయలసీమను పొగుడుతున్నారు నారా లోకేష్.. యువగళం పేరుతో రాయలసీమలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ‘మిషన్ రాయలసీమ’ అనే చర్చా పెట్టి మ‌రి రాయ‌ల‌సీమ గురించి మాట్లాడారు. త‌న తండ్రి సీఎంగా ఉన్న‌ప్పుడు త‌ను మంత్రిగా ప‌ని చేశాను అనే విష‌యం మ‌రిచి మ‌రి రాయ‌ల‌సీమ అభివృధి గురించి మాట్లాడారు. అంత బాగానే ఉన్న లోకేష్ మ‌రి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం కొంద‌రు టీడీపీ నేత‌లు రాయ‌ల‌సీమ ప‌ట్ల మాట్లాడుతున్నా భాష‌. సీఎం జ‌గ‌న్ ను విమ‌ర్శించే టైంలో రాయ‌ల‌సీమ ప‌ట్ల, అత‌ని కులం, మ‌తం ప‌ట్ల‌ వారికి ఉన్న ద్వేషం సృష్టంగా క‌న‌ప‌డుతోంది.

అలాగే రాయ‌ల‌సీమ‌లో పుట్టి, చ‌దివి, ఇక్క‌డి నుండే సీఎం అయిన చంద్ర‌బాబుతో స‌హా త‌న ద‌త్త‌పుత్రుడిగా సుప‌రిచిత్రుడుగా ముద్ర‌ప‌డిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రాయ‌ల‌సీమ చిన్న చూపే.. నోరి తెరిస్తే గుండాలు, రౌడీలు వంటివే వ‌స్తాయి. సీఎం జ‌గ‌న్ రాయ‌ల‌సీమకు చెందిన వాడు అయినంత మాత్ర‌నా ఒక ప్రాంతంపై ద్వేషం పెంచుకోవాలా. పార్టీ వేరు ప్ర‌జలు వేరు అనే సంగ‌తి 40 సంవ‌త్స‌రాల రాజకీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు తెలియ‌క‌పోగా.. త‌న పార్టీ వారు ముఖ్యంగా పార్టీ అఫీసులో కుర్చోని మాట్లాడే వారు రాయ‌ల‌సీమ ప‌ట్ల మ‌రింత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మనిషి మీద కోపం ఉంటే ఆ మ‌నిషిని తిట్టొచ్చు ఆత‌ని పార్టీని తిట్టొచ్చు. కానీ ఆ ప్రాంతాన్ని తిట్టడం ఎంత వ‌ర‌కు సమాజ‌సం అనే విష‌యం టీడీపీ నేత‌లు గుర్తుంచుకోవాలి.

మిష‌న్ రాయ‌ల‌సీమ వంటి క‌బుర్ల కంటే ముందుగా టీడీపీ నేత‌ల్లో ఉండే రాయ‌ల‌సీమ ద్వేషాన్ని త‌గ్గించి మాట్లాడితే గ‌త ఎన్నిక‌ల పరాభవం కాస్తాయిన త‌గ్గుతుంది. లేదు పాద‌యాత్ర రాయ‌ల‌సీమ దాటి ఆంధ్ర‌లోకి ఎంట‌ర్ అవ్వ‌గానే రాయ‌ల‌సీమ రౌడీలు, గుండాలు అంటే మాత్రం మ‌రోసారి రాయ‌ల‌సీమ‌లో టీడీపీ ఖాళీ అవ్వ‌డం తథ్యం.