ఆపరేషన్ కోసం డబ్బిస్తే.. ఆన్ లైన్ గేమ్స్ ఆడాడు

ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడిన యువత, విచక్షణ కోల్పోతున్నారు. మంచి చెడు మరిచిపోతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు, తాత ఆపరేషన్ కోసం ఇచ్చి డబ్బును,…

ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడిన యువత, విచక్షణ కోల్పోతున్నారు. మంచి చెడు మరిచిపోతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు, తాత ఆపరేషన్ కోసం ఇచ్చి డబ్బును, ఆన్ లైన్ గేమ్స్ పెట్టి పోగొట్టుకున్నాడు. మనస్తాపంతో మరణించాడు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటిపల్లిపాలెంకు చెందిన సాద్విక్, ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. రోజులు గడిచేకొద్దీ అది అతడికి వ్యసనంగా మారింది. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు తీసుకురావడం, ఆన్ లైన్ గేమ్స్ పెట్టడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు బాగానే డబ్బులొచ్చాయి. ఆ తర్వాత నుంచి సాద్విక్ కు కష్టాలు మొదలయ్యాయి.

ఆన్ లైన్ గేమ్స్ లో ఎంత డబ్బు పెట్టినా వెనక్కు రాలేదు. ఈ క్రమంలో అప్పులు కూడా చేశాడు సాద్విక్. స్నేహితుల దగ్గర కూడా చాలా అప్పులు చేశాడు.

సాద్విక్ వాళ్ల తాత జబ్బు పడ్డాడు. అతడి ఆపరేషన్ కు డబ్బులు అవసరమయ్యాయి. దీంతో ఆపరేషన్ కోసం సాద్విక్ మేనత్త, 78వేలు పంపించింది. ఆ డబ్బును సాద్విక్ అందుకున్నాడు.

తాతకు సర్జరీ చేయించాల్సిన సాద్విక్, ఆ డబ్బును ఆన్ లైన్ గేమ్స్ లో పెట్టాడు. మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాద్విక్, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.