కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచాలంటున్న హీరో

హీరోయిన్ అదితిరావు హైదరీతో, హీరో సిద్దార్థ్ క్లోజ్ గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది గాసిప్ కూడా కాదు. ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్తున్నారు, ఇనస్టాలో రీల్స్ కూడా చేస్తున్నారు. ఏ…

హీరోయిన్ అదితిరావు హైదరీతో, హీరో సిద్దార్థ్ క్లోజ్ గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది గాసిప్ కూడా కాదు. ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్తున్నారు, ఇనస్టాలో రీల్స్ కూడా చేస్తున్నారు. ఏ ఫంక్షన్ జరిగినా కలిసి హాజరవుతున్నారు. అయితే తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పడానికి మాత్రం నిరాకరిస్తున్నారు.

ఇప్పుడీ రిలేషన్ షిప్ కు సంబంధించి సిద్దార్థ్ కు ప్రశ్న ఎదురైంది. హీరోయిన్ తో డేటింగ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి కదా, మీ రియాక్షన్ ఏంటనేది ఆ ప్రశ్న. సహజంగానే మాటకారి అయిన సిద్దార్థ్, రూమర్స్ అని మీరే అంటున్నారు, అలాంటి ఊహాగానాలపై నేను ఎందుకు స్పందించడం అంటూ దాటేశాడు.

ఈ సందర్భంగా మరో వింత లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చాడు. కొన్ని విషయాల్ని సీక్రెట్ గానే ఉంచాలంట. ఓ హీరో నిజజీవితం గురించి మొత్తం తెలిసిపోతే, అతడు తెరపై పోషించే పాత్రపై ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గిపోతుందనేది ఇతగాడి లాజిక్. కాబట్టి అదితిరావుతో సాగిస్తున్న ఎఫైర్ పై తను స్పందించనంటూ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

మరి సిద్దార్థ్-అదితి సంబంధం గురించి జనాలకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు కూడా సిద్దార్థ్ దగ్గర రెడీమేడ్ సమాధానం ఉంది. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అదితితో ఉన్న రిలేషన్ షిప్ పై తప్పకుండా స్పందిస్తానంటున్నాడు సిద్ధూ. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఇలా స్పందించనంటూనే, పరోక్షంగా అదితితో రిలేషన్ షిప్ లో ఉన్నాననే విషయాన్ని సిద్ధూ స్పష్టం చేసినట్టయింది.

ఈ హీరో నటించిన తాజా చిత్రం టక్కర్. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన సిద్ధార్థ్.. ఇలా అదితితో ఉన్న రిలేషన్ షిప్ పై స్పందించనంటూ స్పందించాడు.