సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య

సిల్లీ రీజన్స్ తో ఆత్మహత్యలు చేసుకోవడం ఈమధ్య కామన్ అయిపోయింది. క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్నారు యువత. మొన్నటికిమొన్న ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వలేదని ఓ కుర్రాడు ఆత్మహత్య…

సిల్లీ రీజన్స్ తో ఆత్మహత్యలు చేసుకోవడం ఈమధ్య కామన్ అయిపోయింది. క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్నారు యువత. మొన్నటికిమొన్న ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వలేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటిదే ఇప్పుడు మరో ఘటన హైదరాబాద్ లో జరిగింది. సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు.

నగరంలోని బోరబండ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు 21 ఏళ్ల చుక్కా సాయికుమార్. ఓవైపు బి.కామ్ చదువుతూ, మరోవైపు డెలివరీ బాయ్ గా కూడా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. నెల రోజుల కిందట ఓ పార్క్ కు వెళ్లినప్పుడు అక్కడ సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు సాయి. తండ్రి ఈఎంఐలో కొనిచ్చిన ఫోన్ అది.

ఆ తర్వాత సాయితండ్రి మరో ఫోన్ కొన్నాడు. అది కూడా ఈఎంఐలో కొన్నదే. అయితే అనుకోకుండా ఆ కొత్త ఫోన్ ను కూడా పోగొట్టుకున్నాడు సాయి. దీంతో తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు. తండ్రి కష్టార్జితాన్ని తను వృధా చేస్తున్నానని ఫ్రెండ్స్ దగ్గర ఏడ్చాడు.

నిన్న సాయంత్రం, వేరే ఫ్రెండ్ మొబైల్ నుంచి తన అన్నకు ఫోన్ చేశాడు సాయి. అమ్మా-నాన్న బాగా చూసుకోవాలని కోరాడు. అలా ఫోన్ చేసిన కొన్ని గంటలకే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.