హీరోయిన్ రీ-ఎంట్రీకి రెడీ

పెళ్లయిందని తెలిస్తే అవకాశాలు తగ్గిపోతాయని, ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టేవారు ఒకప్పుడు. పెళ్లైనా, కానట్టు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పెళ్లి, పిల్లలు అనేది హీరోయిన్ల కెరీర్ కు ఏమాత్రం ఆటంకం కాదు. మొన్నటికిమొన్న కాజల్…

పెళ్లయిందని తెలిస్తే అవకాశాలు తగ్గిపోతాయని, ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టేవారు ఒకప్పుడు. పెళ్లైనా, కానట్టు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పెళ్లి, పిల్లలు అనేది హీరోయిన్ల కెరీర్ కు ఏమాత్రం ఆటంకం కాదు. మొన్నటికిమొన్న కాజల్ పెళ్లి చేసుకుంది, ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఎంచక్కా సినిమాలు చేసుకుంటోంది. ఇక బాలీవుడ్ లో అలియా పరిస్థితి అందరికీ తెలిసిందే. హీరోయిన్ ప్రణీత కూడా బిడ్డకు జన్మనిచ్చి, సినిమాల్లో రాణిస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి పూర్ణ కూడా చేరబోతోంది.

పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్, ఈమధ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పెళ్లయినప్పట్నుంచి, బిడ్డకు జన్మనివ్వడం వరకు ప్రతి విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. రీసెంట్ గా బాబుకు పేరు కూడా పెట్టారు. అలా పూర్తిగా కుటుంబ జీవితానికి పరిమితమైన ఈ నటి, ఇప్పుడు మరోసారి సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది.

ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న పూర్ణ, క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయి చాన్నాళ్లయింది. ఇప్పుడు రీఎంట్రీలో పూర్తిస్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాలనేది ఆమె ఆలోచన. ఈ క్రమంలో, మంచి పాత్రలు దొరికితే, హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాలని ఆమె ఆలోచిస్తోంది.

నిజానికి కెరీర్ లో పెద్ద గ్యాప్ తీసుకోలేదు పూర్ణ. పెళ్లి తర్వాత కూడా ఆమె నటించిన సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన దసరాలో కూడా పూర్ణ ఉంది. సినిమాల్లో నటించడానికి అత్తమామల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో, మరోసారి కెరీర్ ను కంటిన్యూ చేయాలని పూర్ణ భావిస్తోంది.