ఆదిపురుష్ నైజాం గేమ్ మొదలైంది

పెద్ద సినిమాలు ఏవి వచ్చినా నైజాం లో డిస్ట్రిబ్యూషన్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. తెరవెనకాల మంతనాలు నడచిపోతాయి. వున్న రెండు మూడు పార్టీల్లో ఓ రెండు అస్సలు ఆసక్తి కనబర్చవు. మిగిలిన మూడో పార్టీ…

పెద్ద సినిమాలు ఏవి వచ్చినా నైజాం లో డిస్ట్రిబ్యూషన్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. తెరవెనకాల మంతనాలు నడచిపోతాయి. వున్న రెండు మూడు పార్టీల్లో ఓ రెండు అస్సలు ఆసక్తి కనబర్చవు. మిగిలిన మూడో పార్టీ బేరాలు మొదలవుతాయి. హోల్ సోల్ గా కొనుక్కున్న బయ్యర్ కు అప్పటి నుంచి టెన్షన్ మొదలవుతుంది. 

మీటింగ్ లు..మీటింగ్ లు.. కాస్త డౌట్ వున్న పెద్ద సినిమా అయితే ఇక చెప్పనక్కరలేదు. అడ్వాన్స్ చేతిలో పెట్టి సినిమాను చేతిలోకి తీసుకుంటారు. ఈ గేమ్ నిర్మాతలకు, హోల్ సేల్ బయ్యర్లకు అందరికీ తెలిసిందే. కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు. నైజాంలో థియేటర్లు వున్న వాళ్లు, సినిమాలు కొనేవాళ్లు ఒక మాట మీద వుండడంతో, వాళ్లను కాదని వేరే వాళ్లు సినిమాలు కొంటే ఇలాగే వుంటుంది ఎప్పటికీ.

ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా దాదాపు ఇదే గేమ్ మొదలైంది. థియేటర్ లు చేతిలో వున్న ఆసియన్ సునీల్ ఆసక్తి కనబర్చలేదు. దిల్ రాజు ఆసక్తి వుంది.. లేదు అన్నట్లుగా వుండిపోయారు. మూడో పార్టీగా మైత్రీ మూవీస్ మిగిలింది. గతంలో ఎడమొహం..పెడమొహంగా వున్న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ- దిల్ రాజు/శిరీష్ కూడా ఒక్క మాట మీదకు వచ్చారని టాక్ వినిపిస్తోంది.

దాంతో ఆదిపురుష్ కు కాస్త కఠినమైన టర్మ్ అండ్ కండిషన్లు ఎదురవుతున్నాయి. ఆదిపురుష్ హోల్ సేల్ హక్కులు కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా సంస్థ నైజాం ఏరియాకు 60 కోట్లు కోట్ చేస్తోంది. దీని మీద బేరాలు సాగుతున్నాయి. 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్, పది కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ పద్దతిన ఇవ్వడానికి పీపుల్స్ మీడియా సుముఖంగా వుంది. కానీ బేరాలు ఆడుతున్నవారు అక్కడితో ఆగడం లేదు. ఈ సినిమాలో నష్టం వస్తే పవన్ కళ్యాణ్ సినిమా, ప్రభాస్ మారుతి సినిమాల్లో కవర్ చేయాలని కండిషన్లు పెడుతున్నారు.

దీంతో ఎక్కడి వ్యవహారం అక్కడే ఆగిందని తెలుస్తోంది. అన్ని కండిషన్లకు తలొగ్గే బదులు, వేరే మార్గం ఆలోచించే పనిలో పడింది పీపుల్స్ మీడియా.