ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గ్యాప్ ఇవ్వట్లేదుగా!

మొన్నటివరకు బ్రో సినిమాకు వరుసగా కాల్షీట్లు కేటాయించాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఓజీ సినిమాకు అదే విధంగా కాల్షీట్లు ఇస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ గ్యాప్ ఇవ్వలేదు.…

మొన్నటివరకు బ్రో సినిమాకు వరుసగా కాల్షీట్లు కేటాయించాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఓజీ సినిమాకు అదే విధంగా కాల్షీట్లు ఇస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ గ్యాప్ ఇవ్వలేదు.

ఓజీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబయి, పూణె పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆ షెడ్యూల్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్, హైదరాబాద్ లో జరిగిన రెండో షెడ్యూల్ కు కూడా కాల్షీట్లు కేటాయించాడు. ఇప్పుడు వరుసగా మూడోసారి ఇదే సినిమాకు డేట్స్ ఇచ్చాడు.

ఇవాళ్టి నుంచి ఓజీ సినిమా మూడో షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లోనే ఈ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో త్వరలోనే పవన్ కల్యాణ్ జాయిన్ అవ్వబోతున్నాడు.

ఓ సినిమాకు పవన్ కల్యాణ్ ఇలా వరుసపెట్టి డేట్స్ ఇవ్వడం కొత్తేంకాదు. భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇలానే చేశాడు. కాకపోతే పవన్ చేయాల్సిన హరిహర వీరమల్లు సినిమా అలానే పెండింగ్ లో ఉంది. ఆ సినిమా కంటే ముందే ఇప్పుడు ఓజీ పూర్తయ్యేలా ఉంది.

లెక్కప్రకారం హరిహర సినిమాలో పవన్ జాయిన్ అవ్వాలి. కానీ రీసెంట్ గా జరిగిన అగ్నిప్రమాదంలో ఆ సినిమా సెట్ డ్యామేజ్ అయింది. బహుశా, అందుకే ఓజీకి మరోసారి పవన్ డేట్స్ ఇచ్చి ఉంటాడు. ఇక హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లో ఉంది. ఆ సినిమాను కూడా పవన్ పూర్తిచేయాల్సి ఉంది.