లెక్కప్రకారం, నాని సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ హాయ్ నాన్న మూవీ ఇప్పుడు ప్రీ-పోన్ అయింది. అనుకున్న షెడ్యూల్ కంటే 2 వారాల ముందుగా థియేటర్లలోకి వస్తోంది.
నాని తాజా చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయాలని నిర్ణయించారు. కొద్దిసేపటి కిందట టీజర్ రిలీజ్ చేశారు. అందులో విడుదల తేదీని ప్రకటించారు.
ఊహించని విధంగా క్రిస్మస్ బరిలో సలార్ సినిమా నిలిచింది. దీంతో అప్పటికే ఆ స్లాట్ లో ఉన్న సినిమాలన్నీ చెల్లాచెదురయ్యాయి. సైంధవ్ సినిమా పోస్ట్ పోన్ అయి సంక్రాంతికి వెళ్లగా.. నాని సినిమా ఇలా ప్రీ-పోన్ అయి 2 వారాల ముందుగా రిలీజ్ అవుతోంది.
అయితే ఇప్పుడు డిసెంబర్ 8 స్లాట్ లో కొత్త పోటీ మొదలైంది. ఆల్రెడీ ఆ తేదీకి వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలంటైన్, నితిన్ చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీమేన్ సినిమాల్ని షెడ్యూల్ చేశారు. ఈ రెండు సినిమాల నుంచి రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వచ్చాయి.
ఇప్పుడీ సినిమాలకు ఒక రోజు ముందు నాని సినిమా వస్తోంది. చూస్తుంటే.. వరుణ్ తేజ్, నితిన్ సినిమాల్లో ఒకటి డ్రాప్ అయ్యేలా కనిపిస్తోంది. అన్నట్టు విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అదే తేదీకి రాబోతోంది.