ఓ కొత్త నావల్ పాయింట్ తో తయారవుతున్న సినిమా హాయ్ నాన్న. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి గతంలో వచ్చిన సినిమాల మాదిరిగా భార్యాభర్తలు విడిపోయారనో, ఒకరు దూరమయ్యారనో థాట్ రావచ్చు. కానీ అలాంటి రొటీన్ పాయింట్లు కాకుండా కొత్త థాట్ తో తయారైన సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. టీజర్ మొత్తం ఫీల్ గుడ్ గా కట్ చేసారు.
సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాలు, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు రెండింటినీ సమపాళ్లలో మేళవించినట్లు కనిపిస్తోంది. నాని, మృణాళ్ ఠాకూర్ ల జోడీ బాగుంది. పాప కియారా ఖన్నా క్యూట్ గా వుంది. చాలా బాగా చేసినట్లు క్లారిటీ ఇచ్చింది టీజర్.
టీజర్ చూసిన వాళ్లకు చిన్న సస్పెన్స్ వుండనే వుంటుంది. ఈ పాప తండ్రితో వుంది. తల్లి మృణాల్ ఠాకూర్ నా? మరి సెపరేట్ గా ఎందుకు వుంది.రొటీన్ అపార్థాల ఫార్ములానా అన్న అనుమానం వుంటుంది. కానీ అదేదీ టీజర్ లో రివీల్ చేయలేదు.
టీజర్ కు ఇచ్చిన ఆర్ఆర్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా అందంగా వుంది. టోటల్ గా అన్ని విధాలా ఫీల్ గుడ్ టీజర్ అనే ఫీల్ వచ్చేలా వుంది టీజర్.