బాబుకు ‘బండ్ల’ కౌంటర్?

చంద్రబాబు వెళ్లి అమిత్ షా ను కలిసారు. దీంతో భాజపా-తేదేపా పొత్తు మీద వార్తలు మొదలయ్యాయి. తెలుగుదేశాన్ని అభిమానించేవారికి కూడా ఇది పెద్దగా నచ్చడం లేదు. దాంతో ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయాలు…

చంద్రబాబు వెళ్లి అమిత్ షా ను కలిసారు. దీంతో భాజపా-తేదేపా పొత్తు మీద వార్తలు మొదలయ్యాయి. తెలుగుదేశాన్ని అభిమానించేవారికి కూడా ఇది పెద్దగా నచ్చడం లేదు. దాంతో ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఫైర్ ట్వీట్ లు వేసే బండ్ల గణేష్ కు కూడా గట్టి ట్వీట్ వేసారు.

‘’..కర్మ కర్మ కాకపోతే ఇంకేంటి ఆయన సిపిఎం అంటే సిపిఎం అనాలి బిజెపి అంటే బిజెపి అనాలి ..కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి ఆయన కన్వీనెంట్గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం మంచి చెడు మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి, దరిద్రం..’’

ఇదీ బండ్ల వేసిన ట్వీట్. చంద్రబాబు పేరు ప్రస్తావన లేకున్నా తెలుగుదేశం-భాజపా పొత్తు మీద వేరే వాళ్లు వేసిన కామెంట్ కు బదులుగా ఈ కామెంట్ పెట్టారు కనుక దానికి రిలేటెడ్ నే అనుకోవాలి.

చంద్రబాబు మీద ఇటీవల కాలంలో న్యూట్రల్ వ్యక్తులు ఇంత నేరుగా కామెంట్ చేయడం ఇదే అనుకోవాలి.